పొలిమేర, పొలిమేర 2 వంటి హారర్ చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి కామాక్షి భాస్కరాల, తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఆమె ఇటీవల ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొని ఈ విషయం చెప్పింది. కామాక్షి భాస్కరాల, అల్లరి నరేష్ హీరోగా నటించిన ’12ఎ రైల్వే కాలనీ’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నవంబర్ 21న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కామాక్షి మీడియాతో ముచ్చటించింది.
Also Read :Samantha: నవ్వేవాళ్ళు నవ్వనీ.. ఏడ్చేవాళ్ళు ఏడ్వనీ.. డోంట్ కేర్!
ఈ సందర్భంగా తన మనసుకు శాంతిని, బలాన్ని ఇచ్చే వింత అలవాటు గురించి కామాక్షి వెల్లడించింది. తాను ‘లో’గా (Low) లేదా నిరుత్సాహంగా ఫీల్ అయ్యే సందర్భాలలో స్మశానానికి వెళ్తూ ఉంటానని పేర్కొంది. అక్కడికి వెళితే, తాను బూస్ట్ అప్ అవుతానని, మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని ఆమె చెప్పింది. సాధారణంగా ప్రజలు భయపడే ప్రాంతమైన స్మశానం, కామాక్షికి మాత్రం పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే స్థలంగా ఉండటం సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో చర్చనీయాంశమైంది.
