Site icon NTV Telugu

Sai Dharam Tej: వాటితో సెల్ఫీ దిగాలి..అదే అసలు విజయం

Sai Dharam Tej

Sai Dharam Tej

మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరోగా టాలీవుడ్‌కి పరిచయమైన సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నా, యాక్సిడెంట్ తర్వాత ఆయన సరైన హిట్టు అందుకునేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. చేసిన ‘రిపబ్లిక్’ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ‘బ్రో’ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. ప్రస్తుతానికి ఈ సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్, సుమారు 150 కోట్లతో ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Also Read:Monalisa: నక్క తోక తొక్కిన పూసల మోనాలిసా.. పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్!

అయితే, ఈ మధ్యకాలంలో ఎక్కువగా సాయి ధరమ్ తేజ్ సోషల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్‌కి హాజరవుతున్నాడు. అందులో భాగంగానే ఒక ప్రోగ్రామ్‌కి హాజరైన నేపథ్యంలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “అసలైన సక్సెస్ అంటే నీతో ఫోటోలు దిగడం కాదు, నీ కటౌట్‌తో ఫోటోలు దిగటం” అంటూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అలా దిగినప్పుడే దాన్ని అసలైన స్టార్‌డమ్ అంటారంటూ సాయిధరమ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాని రోహిత్ డైరెక్షన్లో, ‘హనుమాన్’ నిర్మాతలు చైతన్య, నిరంజన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version