గతేడాది రిపబ్లిక్ మూవీతో మంచి హిట్ అందుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ గురైన సంగతి తెలిసిందే. దాంతో కోలుకోవడానికి సాయికి చాలా సమయం పట్టింది. ఇక అంతా సెట్ అయ్యాక.. తిరిగి సినిమా సెట్‌లోకి అడుగుపెట్టాడు సాయి ధరమ్. ప్రస్తుతం తన 15వ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే SDT15 పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సుకుమార్ రైటింగ్స్‌లో కార్తిక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా తర్వాత సాయి నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘రచ్చ’ సినిమా తీసి.. మాసివ్ హిట్ అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ సంపత్ నంది. చివరగా గోపీచంద్‌తో ‘సీటీమార్’ సినిమాను తెరకెక్కించిన సంపత్ నంది.. ఇప్పుడు సాయితో ఓ సినిమా చేయబోతున్నారు. దాంతో చరణ్ తర్వాత చేస్తున్న మరో మెగా హీరో సినిమా ఇదేనని చెప్పొచ్చు.
ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. సాయి ధరమ్ తేజ్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఓ అద్భుతమైన కమర్షియల్ కథని సిద్ధం చేశారట సంపత్ నంది. దాంతో ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ హై ఓల్టేజ్ లెవల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయట. త్వరలోనే అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేయబోతున్నారట. ఇకపోతే.. సంపత్ నంది ప్రాజెక్ట్‌తో పాటు మరికొన్ని సినిమాలను లైన్లో పెట్టాడు సాయి ధరమ్. వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కూడా ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. తమిళ్ హిట్ మూవీ వినోదయ సీతమ్ రీమేక్‌లో కీలక పాత్రలో నటించబోతున్నాడు సాయి ధరమ్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇలా గాయపడి కోలుకున్న ఈ మెగా మేనల్లుడు.. వరుస సినిమాలను లైన్లో పెడుతూ.. దూసుకుపోతున్నాడని చెప్పొచ్చు.
