Rukmini Vasanth: క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంత్ ఎక్స్ (ట్వీట్టర్) లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అతడిపై చర్యలు తీసుకుంటానంటూ పెట్టిన పోస్ట్ అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఎంతోమంది ఇతరుల పేర్లను ఉపయోగించి పెద్ద ఎత్తున రుక్మిణి పేరుతో కూడా మోసాలకు పాల్పడుతున్నారని తెలియడంతో.. ఈ విషయంలో తన అభిమానులకు వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు.. ‘‘కొద్ది రోజులుగా నా పేరు మీద కూడా పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్న విషయం నా దృష్టికి వచ్చింది.. ఓ సెల్ నెంబర్ ఉపయోగించి ఒక వ్యక్తి అచ్చం నాలాగే మాట్లాడుతూ.. ఇతరులను సంప్రదించినట్లు నాకు తెలిసింది.. ఈ నెంబర్ నాది కాదు, ఈ నెంబర్ నుంచి ఎవరికైనా ఫోన్ లేదా మెసేజ్‌లు, ఫోన్ కాల్ వచ్చిన స్పందించవద్దు ఇలా ఒకరి పేరును ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడటం సైబర్ నేరం కిందకు వస్తుందని రుక్మిణి వసంత్ తెలియజేసింది.
Read Also: PM Modi: వారణాసిలో 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోడీ
కాగా, ఇలాంటి మోసపూరిత, తప్పుదారి పట్టించే కార్యకలాపాలలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను అని నటి రుక్మిణి వసంత్ హెచ్చరించింది. ఈ నెంబర్ నుంచి ఎవరికైనా ఫోన్ లేదా మెసేజ్ వస్తే క్లారిటీ కోసం మీరు నేరుగా నన్ను లేదా నా టీమ్‌ను సంప్రదించవచ్చు అని వెల్లడించింది. ఇలాంటి మోసాలకు గురి కాకుండా సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి అని సూచించింది. మీ అందరి సహకారానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
