Site icon NTV Telugu

Vijay Deverakonda : ‘రౌడీ జనార్దన’.. మొదలెట్టనున్న కొండన్న.. ముహుర్తం ఎప్పుడంటే

Rowdy Janardhana

Rowdy Janardhana

విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయితే చేస్తున్నడు కానీ హిట్స్ మాత్రం రావట్లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖుషి, ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ కాగా రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ ప్లాప్ గా నిలిచింది. కింగ్డమ్ రిజల్ట్ తో కాస్త డీలా పడిన దేవరకొండ ఎలాగైన హిట్ కొట్టి తానేంటో మరోసారి నిరూపించాలని పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

Also Read : Megastar : క్లాస్ లుక్ లో మన ‘మెగాస్టార్’ చిరు లేటెస్ట్ ఫొటోస్

అందులో ఒకటి రౌడీ జనార్దన. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ SVC బ్యానర్ లో వస్తున్న 49వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి రానివారు రాజావారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. తోలి సినిమాను క్లాస్ గా డైరెక్ట్ గా చేసిన ఈ దర్శకుడు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమాను తీసుకువస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలను ఈ దసరా కానుకగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. కానీ అనుకోని కారణాల వలన ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇక ఇప్పుడు ఈ నెల 11న పూజా కార్యక్రమాలు నిర్వచించనున్నారు. 16వ తేదీ నుండి షూట్ స్టార్ట్ చేయనున్నారు.  ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి తన మార్కెట్ ను కాపాడుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా కీర్తి సురేష్ నటించబోతుంది. అలాగే విజయ్ కు యంటాగొనిస్ట్ గా బాలీవుడ్ కు చెందిన స్టార్ నటుడి పేరును పరిశీలిస్తున్నారు.

Exit mobile version