“రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్”… ఫ్యాన్స్ కు పండగే ఇక !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో “ఆర్ఆర్ఆర్” బృందం ప్రమోషన్లను స్టార్ట్ చేస్తోంది. దాదాపు మూడు సంవత్సరాల నుంచి షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు, హీరోల క్యారెక్టర్ కు సంబంధిచిన టీజర్లను మినహాయించి ఏమీ విడుదల చేయలేదు. ఎట్టకేలకు జూలై 15న ఉదయం 11 గంటలకు “ఆర్ఆర్ఆర్” మేకింగ్ వీడియోను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేకింగ్ వీడియోకు ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్నీ ప్రకటిస్తూ వారు పోస్ట్ చేసిన పోస్టర్ ఆసక్తిని పెంచేస్తోంది.
Read Also : “ఏజెంట్” రెడీ అవుతున్నాడు… మరి మీరు ?
Also Read
రెండు పాటలు మినహా “ఆర్ఆర్ఆర్” షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ రెండు ట్రాక్‌లను త్వరలో చిత్రీకరించనున్నారు. ముందుగా అనుకున్నదాని ప్రకారం 2021 అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ పాత్రలకు రెండు భాషల్లో డబ్బింగ్ పూర్తి చేసేశారు. కాగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న “ఆర్ఆర్ఆర్”లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్గన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!