“ఏజెంట్” రెడీ అవుతున్నాడు… మరి మీరు ?

అఖిల్ అక్కినేని 5వ చిత్రంగా “ఏజెంట్” రూపొందుతున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో అఖిల్ సరికొత్త మేకోవర్ లో దర్శనం ఇవ్వనున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ యంగ్ హీరోను ఇంతకుముందెన్నడూ ప్రేక్షకులు చూడని స్టైలిష్ లుక్ లో చూపించనున్నారు. అక్కినేని అభిమానులను థ్రిల్ చేయడానికి “ఏజెంట్” ఫస్ట్ లుక్ ను అఖిల్ పుట్టినరోజున విడుదల చేయబోతున్నారు.

Read Also : పోలీసులను ఆశ్రయించిన సీనియర్ హీరో

ఇక తాజాగా అఖిల్ జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న ఓ పిక్ ను సురేందర్ రెడ్డి పోస్ట్ చేస్తూ “మీకు ముందు ముందు ఉంది పండగ” అంటూ కామెంట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఈ పిక్ లో అఖిల్ తన పేస్ చూపించకుండా అటువైపుకు తిరిగి నిలబడగా… ఆయన వీపు కండరాలు, వాటిపై ఉన్న పచ్చబొట్టు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. “ఏజెంట్ లోడింగ్, మీరు వైల్డ్ రైడ్ కోసం సిద్ధంగా ఉన్నారా” అంటూ మేకర్స్ ప్రమోషన్లకు సిధ్దమవుతున్నట్టు ప్రకటించారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం కంపోజ్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇందులో అఖిల్ ‘ఏజెంట్’గా కనిపించనున్నాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-