Chhatrapati Shivaji: ‘కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటుడు రిషబ్ శెట్టి ఖాతాలో మరో భారీ ప్రాజెక్ట్ చేరింది. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్, లెజెండ్ స్టూడియోస్‌తో చేతులు కలిపి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ సినిమాను నిర్మించనున్నారు. భారతీయ వీరత్వానికి ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చారిత్రక పాత్రలో రిషబ్ శెట్టి నటించనుండటంతో ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ రోజే భారీ క్రేజ్ మొదలైంది.
ఈ చిత్రానికి ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్ – ఛత్రపతి శివాజీ మహారాజ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సందీప్ సింగ్ దర్శకత్వం వహించనున్న ఈ భారీ సినిమాను ఏకంగా రెండు భాగాలుగా నిర్మించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శివాజీ మహారాజ్ పోరాటాలు, ఆయన స్వరాజ్య స్థాపన ప్రయాణాన్ని వెండితెరపై ఎక్కడా తగ్గకుండా పూర్తి స్థాయిలో ఆవిష్కరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబో సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందనే దానిపై మేకర్స్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. భారీ ప్రీ ప్రొడక్షన్, విజువల్ వర్క్ అవసరం ఉన్నందున ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను 2027 ప్రారంభంలో పట్టాలెక్కించనున్నారు. టీ-సిరీస్ లాంటి బడా బ్యానర్, నేషనల్ అవార్డ్ విన్నర్ రిషబ్ శెట్టి కలయికలో రానున్న ఈ చారిత్రక విజువల్ వండర్ భారతీయ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Swarajya was not just a dream, it was a vision that shaped history. 🚩🇮🇳
It is our honour and privilege to be part of a cinematic tribute to the extraordinary legacy of Chhatrapati Shivaji Maharaj. T-Series collaborates with @shetty_rishab and @thisissandeeps for The Pride of Bharat – #ChhatrapatiShivajiMaharaj, a grand two-part historical epic
Starring Rishab Shetty, directed by Sandeep Singh and produced by Bhushan Kumar, this ambitious saga is set to go on floors in early 2027. 🔥
जय भवानी, जय शिवाजी! 🚩
@shetty_rishab #BhushanKumar #KrishanKumar @thisissandeeps @ShivChanana @NeerajKalyan_24 @kabirsadanand #RishiVirmani @TSeries #TSeries @legendstudios_
#ThePrideofBharatChhatrapatiShivajiMaharaj
— T-Series (@TSeries) October 30, 2026

