Site icon NTV Telugu

Jai Hanuman: బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. అరాచకం కాంబో లోడింగ్

Jai Hanuman

Jai Hanuman

Rishab Shetty as Lead in Prashanth Varma’s Jai Hanuman: టాలీవుడ్ లోనే కాదు ఇండియా వైడ్ సినిమా ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో జై హనుమాన్ కూడా ఒకటి. ఈ ఏడాది మొదట్లో సంక్రాంతి సందర్భంగా తేజా సజ్జ ప్రధాన పాత్రలో హనుమాన్ అనే సినిమా తెరకెక్కింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొట్టమొదటి సినిమాగా ఈ సినిమాని మొదటి నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ ప్రచారానికి తగ్గట్టే వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. అలాగే సౌత్ లో కూడా సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమాని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అది ఆ టైంకి తీసుకురావడం కష్టమే.

Darshan: బళ్లారి జైలుకు అంబులెన్స్.. ఆందోళనలో దర్శన్ ఫాన్స్??

ఇప్పటివరకు ఆ సినిమా ఇంకా పట్టాలే ఎక్కలేదు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక షాకింగ్ వార్త తెర మీదకు వచ్చింది. అదేంటంటే జై హనుమాన్ సినిమాలో లీడ్ రోల్ లో నటించేది రిషబ్ శెట్టి అని తెలుస్తోంది. కాంతార సినిమాతో ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి జై హనుమాన్ సినిమాలో కనుక నటిస్తే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్ లో ఉంటుందని భావిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కూడా అందుకే ఆయనను తీసుకోవాలని భావిస్తున్నాడని ఇప్పటికే కథ చెప్పగా దానికి రిషబ్ శెట్టి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ గనక సెట్ అయితే ఇక బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏమవుతుందో.

Exit mobile version