NTV Telugu Site icon

Rinku Rajguru: తనపై వస్తున్న రూమర్స్‌కి చెక్ పెట్టిన స్టార్ హీరోయిన్..!

February 7 (77)

February 7 (77)

బాష ఏదైనా ఒక మూవీ క్లిక్ అయితే అది చిన్న సినిమా అయినా సరే అని ఇండస్ట్రీలో విజయం సాధిస్తుంది. అలాంటి చిత్రాల్లో ‘ సైరట్‌’ ఒకటి. 2016లో మరాఠీలో వచ్చి బాక్సాఫీస్‌ వద్ద టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ మారిన ఈ మూవీ ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. ఇందులో హీరోయిన్ గా నటించిన రింకు రాజ్‌గురు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ మూవీ టైంలో16 ఏండ్ల వయస్సులోనే లీడ్ హీరోయిన్‌గా మూవీ లవర్స్‌ను ఇంప్రెస్‌ చేసి.. కోట్లాదిమంది ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ మూవీతో ఎంట్రీ లో నేషనల్ అవార్డు అందుకుంది. ఇక ఆ తర్వాత కన్నడ, హిందీ భాషల్లో వరుస ఆఫర్లు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు పెళ్లి గురించి వార్తలు వినపడుతున్నాయి.

Also Read: Nithiin: నితిన్ ‘రాబిన్‌హుడ్’ నుండి సెకండ్ సింగిల్ అప్‌డెట్

తాజాగా రింకూ రాజ్‌గురు బీజేపీ ఎంపీ తనయుడు కృష్ణరాజ్‌ మహాధిక్‌ తో ప్రేమాయణం సాగిస్తోందని.. త్వరలోనే పెళ్లి కూడా జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కృష్ణరాజ్‌ మహాధిక్‌తో కలిసి రింకూ కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించింది. అక్కడ వీరిద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో రుమర్స్ మరింత ఊపందుకున్నాయి. దీంతో వారిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదని ఆమె కుటుంబసభ్యులు స్పష్టం చేయగా.. ‘ఆలయానికి వెళ్ళినప్పుడు దర్శన సమయంలో అక్కడ కలిశాం ’అని రింకూ వివరించింది. అలాగే కృష్ణరాజ్ మహాదిక్ కూడా స్పందిస్తూ ‘ఆ ఫోటోను చూసి తప్పు పట్టకండి. రింకూ నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. ఆమె ఒక కార్యక్రమం కోసం కొల్హాపూర్ వచ్చింది. ఆ సందర్భంలో నేను, రింకూ కలిశాము. అంతే’ అని వివరణ ఇచ్చారు. మొత్తానికి చిన్నపాటి క్లారిటీ అయితే ఇచ్చారు.