NTV Telugu Site icon

“బిగ్ బాస్” రేసులో ప్రముఖ హీరోయిన్లు?

Rhea Chakraborty to take part in Bigg Boss 15?

బాలీవుడ్ నటి రియా చక్రవర్తి గత ఏడాది అంతా వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యలో ఆమెపై దారుణంగా ట్రోల్ జరిగింది. పైగా డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలుకు కూడా వెళ్ళింది. అయితే ఆమె జైలు నుంచి బయటకు వచ్చాక దర్శకనిర్మాతలు ఆమెకు సినిమా ఆఫర్లు ఇచ్చారు. ఇక సుశాంత్ ఆతహత్య కేసులో రియా చక్రవర్తికి కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ దొరికింది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి హిందీ బిగ్ బాస్ షో మేకర్స్ రాబోయే సీజన్-15 కోసం ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సీనియర్ నటి భూమికా చావ్లా, నియా శర్మల పేర్లను కూడా ఫైనల్ చేయనున్నారని టాక్. టెలివిజన్ నటి నియా శర్మకి భారీ ఫాలోయింగ్. సోషల్ మీడియాలో ఆమె హాట్ పిక్స్ కు లక్షలాది లైక్స్, కామెంట్స్ కురుస్తాయి. ప్రముఖ వీడియో జాకీ అనుషా దండేకర్, దివ్యంకా త్రిపాఠి, నేహా మార్డా, సనయ ఇరానీ, దిశా వఖాని, వివేక్ దహియా, మొహ్సిన్ ఖాన్, పార్థ్ సమంతాక్, క్రుష్నా అభిషేక్‌లతో పాటు సంభావ్య ఈ జాబితాలో ఉన్నారు.