Site icon NTV Telugu

Bharateeyudu 2: భారతీయుడు -2 టీంకి నా ప్రత్యేక అభినందనలు : సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Bharatheeyudu 2

Revanth Reddy Bharatheeyudu 2

Revanth Reddy Congratulates Bharateeyudu 2 Team: భారతీయుడు -2 సినిమా బృందానికి నా ప్రత్యేక అభినందనలు అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వారికి అభినందనలు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం… ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా… శ్రీ కమల్ హాసన్…శ్రీ శంకర్…శ్రీ సిద్దార్థ… శ్రీ సముద్రఖని కలిసి ఒక అవగాహనా వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయం అని ఆయన అన్నారు. క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం విడుదల కానుంది.

Harish Shankar: ముసలి నక్క నా జోలికొస్తుంది.. వదలనంటూ హరీష్ శంకర్ వార్నింగ్!

ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. ఇక ఈ మూవీ విశేషాలను పంచుకునేందుకు చిత్రయూనిట్ సోమవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో ఈ డ్రగ్స్ అవేర్నెస్ కోసం ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నను అపార్ధం చేసుకున్న సిద్దార్థ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చినట్టు మాట్లాడారు. అయితే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్షమాపణలు చెబుతూ సిద్దార్థ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇక ఆ తరువాత డ్రగ్స్ వాడకం ప్రమాదకరం అంటూ కమల్ హాసన్, శంకర్, సిద్దార్థ, సముద్రఖనిలతో ఒక అవేర్నెస్ వీడియో చేసి రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే వారికి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

Exit mobile version