Site icon NTV Telugu

Raviteja: రెప్పల్’తో డప్పుల్ మోగిస్తేనే మజా!

Reppal Dappul

Reppal Dappul

‘Reppal Dappul’ from ‘Mr Bachchan’ seems to be a mass Chartbuster: మాస్ మహారాజా గా పేరు తెచ్చుకున్న రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాని అనూహ్యంగా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయబోతున్న నేపద్యంలో ప్రమోషన్స్ వేగం పెంచింది. అందులో భాగంగానే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రెప్పల్ డప్పుల్ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ సింగిల్ కి ఈ సాంగ్ కి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక ఈ సాంగ్ ని పరిశీలిస్తే పూర్తిస్థాయి మాస్ మసాలా సాంగ్ అనిపిస్తోంది. ఒక పక్క మ్యూజిక్ కంపోజిషన్ కానీ ట్యూన్ లో ఉన్న వేరియేషన్స్ కానీ ఒక మాస్ చార్ట్ బస్టర్గా నిలిచేలా మ్యూజిక్ అందించాడు మిక్కీ జే మేయర్.

Tamannah: గులాబీయే గులాబీని ముద్దాడితే తట్టుకోడం ఎలా తమన్నా?

అనురాగ్ కులకర్ణి, మంగ్లీ తమదైన వాయిస్ తో ఈ సాంగ్ కి మరింత ప్రాణం పోశారని చెప్పొచ్చు. మోస్ట్ హపెనింగ్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ ఆసక్తికరమైన లిరిక్స్ అందించిన ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. అంతేకాదు మామూలుగానే రవితేజ అంటే ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేసేలా భాగ్యశ్రీ స్టెప్పులు కనిపిస్తున్నాయి. లిరికల్ వీడియో అయినా కొన్ని డాన్స్ స్టెప్స్ ని మాత్రం ప్రేక్షకులకు లీక్ లాగా రిలీజ్ చేశారు మేకర్స్. మొత్తం మీద భాగ్యశ్రీ తనదైన మాస్ స్టెప్పులతో పాటు గ్లామర్ తో ఆకట్టుకుంటుందని చెప్పకనే చెప్పేశారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ విజువల్ గా కూడా అద్భుతంగా ఉండబోతుందని యూనిట్ చెబుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సాంగ్ ని మీరు కూడా వినేయండి.

Exit mobile version