యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. గతం లో వీరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ సాదించింది.ఇప్పుడు వీరి కలయికలలో రాబోతున్న దేవరపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నుండి రాబోతున్న సినిమా కానుండడంతో ట్రేడ్ వర్గాలు ఈ సినిమా రిజల్ట్ పట్ల ఆసక్తికరంగా చూస్తున్నాయి. మరో వైపు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన కంటెంట్ కాపీ ఆరోపణలను కాస్త గట్టిగానే ఎదుర్కొంటుంది. ఈ సినిమా సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కు ప్లాన్ చేశారు.
Also Read: Committee Kurrollu : చిన్న సినిమాలకు ఊపు తెచ్చిన కమిటీ కుర్రోళ్లు సక్సెస్…
దేవరకు ఇటు తెలుగు అటు తమిళ్, కన్నడ, మళయాళంలో సోలో రిలీజ్ దొరుకుతుందని భావించారు. కాని ఇప్పుడు తమిళ స్టార్ హీరో కార్తీ సినిమా నుండి పోటి ఎదురైంది. తమిళంలో కార్తీ, అరవింద్ స్వామి కలయికలో ఓ రాబోతుంది. ఈ సినిమాను సెప్టెంబరు 27న రిలీజ్ చేస్తున్నారు. కార్తీ సినిమాలకు తమిళంలో మంచి మార్కెట్ ఉంది. సో తమిళ్ లో కాంపిటేషన్ మీద దేవర రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను సత్యంసుందరం గా తెసుకు వస్తున్నారు మేకర్స్. కార్తీ సినిమా ఎంత మాత్రం ప్రభావం చూపుతుంది అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. కాగా దేవర ట్రైలర్ ను సెప్టెంబరు 10 న ముంబై లో రిలీజ్ చేయబోతున్నారు. దేవర టీమ్ మొత్తం ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.