NTV Telugu Site icon

Release Clash : సూర్య కు పోటీగా మహేశ్ బాబు మేనల్లుడు

Nov 14

Nov 14

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో పాన్ ఇండియా బాషలలో తెరకెక్కింది. అత్యంత భారీ బడ్జెట్ పై స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా అక్టోబరు 10న ఇతర సినిమాలు పోటీ ఉండడంతో సోలో రిలీజ్ కోసం ఈ వాయిదా పడిన ఈ సినిమా నవంబరు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.

Also Read : Dasaradh : ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’ రీమేక్ కాదు..

తమిళ్ లో సోలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు తెలుగులో మాత్రం సోలో రిలీజ్ దొరకలేదు. టాలీవుడ్ లో కంగువ రిలీజ్ రోజున మెగా ప్రిన్స్ నటించిన మట్కా నవంబరు 14న రిలీజ్ అని ప్రకటించారు. వైరా ఫిల్మ్స్ వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమాను కలిపి నిర్మించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘మట్కా’తో పాన్ ఇండియా మార్కెట్ లోకి  అడుగుపెట్టబోతున్నాడు. కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఆ సినిమాతో పాటు మరో యంగ్ హీరో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటించిన ‘దేవకి నందన వాసుదేవ’ సినిమాను కూడా నవంబరు 14 న రిలీజ్ అని అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ సినిమా హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించాడు. ఈ రెండు సినిమాలు నుండి సూర్య సినిమా పోటీ ఎదుర్కోక తప్పదు. రెండు సినిమాలకు ఇన్ సైడ్ మంచి రిపోర్ట్స్ ఉన్నాయి.

Show comments