NTV Telugu Site icon

Rekha Nair: తమిళ లైంగిక వేధింపుల లిస్టు తీస్తే 500 మంది ఇరుక్కుంటారు.. నటి సంచలనం

Rekha Nair

Rekha Nair

Rekha Nair Sensational Comments on Tamil industry Casting Couch: మలయాళ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులను బట్టబయలు చేస్తూ హేమ కమిటీ నివేదికపై తమిళంలో పలు సినిమాలు చేసిన మలయాళ ప్రాంత నటి రేఖా నాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా అనేది మొదలైనప్పటి నుంచి లైంగిక వేధింపులు ఉన్నాయి. ఆ కాలంలో మీడియా డెవలప్‌మెంట్ లేకపోవడంతో ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సర్దుకుపోయేవారు అని అన్నారు. అదే సమయంలో ఆ అడ్జస్ట్‌మెంట్‌కు తగ్గట్టు ఇమడలేక సినిమాల నుంచి తప్పుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారని అన్నారు. తమిళ సినిమాలో ఇలాంటి లైంగిక వేధింపులు లక్షల్లో ఉన్నాయి.

Mohammed Shami: తుది జట్టు నుంచి తప్పించాలనే ఆలోచన మరోసారి రాకుండా చేశా: షమీ

నేను కనుక దాని గురించి మాట్లాడితే నాకు ఇక్కడ సినిమాల్లో ఛాన్స్‌ ఇక ఇవ్వరు. అందుకే చాలా మంది నటీమణులు దీని గురించి మాట్లాడరు అని రేఖ అన్నారు. ఇక ఇప్పుడు మలయాళంలో కనీసం 10, 20 వికెట్లు పడతాయి. అదే తమిళ సినిమా లిస్ట్ చూస్తే 500, 600 వికెట్లు పడతాయి అని అన్నారు. సినీ పరిశ్రమలో ప్రతిభావంతులకు గౌరవం లేదు. బాగా నటించగల, డ్యాన్స్ చేయగల వారి కంటే చెప్పినపని చేసే వారికే ప్రాధాన్యత ఇస్తారు అన్నారు. ఇప్పుడు ఒక నటి దాని గురించి మాట్లాడితే ఇతర మగ నటుల వేధింపులకు గురైన వారు బయటకు వస్తారు కానీ అలా మాట్లాడే వారే లేరని ఆమె అన్నారు.

మలయాళంలో పీక్‌లో ఉన్న నటి ఇక్కడ వేధింపులు భరించలేక ఊరు నుంచి పారిపోయింది. ఇక ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునే పరిస్థితిలో తమిళ సినీ సంఘాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తే ప్రశ్నార్థకమే. ఆఫీసుకు వెళితే అక్కడ ఉండరు. విశాల్ చెప్పుతో కొట్టమని చెప్పాడు, కానీ నేను అతను చెప్పేకంటే కంటే ముందే కొట్టాను. కానీ మీరు బాధితులను ఎలా చిత్రీకరిస్తారు, బాధితులను ఎక్కడ దాచారు అని ఆమె ప్రశ్నించారు. 2014లో ఓ రియాల్టీ షో ముగిసిన తర్వాత చాలా మంది మహిళలను నిర్వాహకులు తీసుకెళ్లారని అన్నారు. 10 ఏళ్లు గడిచినా ఇంకా అదే మాట మాట్లాడుకుంటున్నాం. ఒక్క మలయాళంలోనే కాదు, అన్ని భాషల సినిమాల్లో ఇలాంటి లైంగిక ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి అని ఆమె అన్నారు.

Show comments