NTV Telugu Site icon

Rekha Boj: ఇంకో జన్మ ఎత్తినా మారరు.. తెలుగు దర్శకనిర్మాతలపై హీరోయిన్ ఫైర్

Rekha Boj

Rekha Boj

Rekha Boj Shocking Comments on Telugu Film Makers: ఇంకో జన్మ ఎత్తినా మారరు అంటూ తెలుగు దర్శకనిర్మాతలపై హీరోయిన్ ఫైర్ అయింది. పలు ప్రైవేట్ ఆల్బమ్స్, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో ఫేమస్ అయింది రేఖ భోజ్. పలు సినిమాల్లో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమాలు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో సినిమాల్లో నటిగా బిజీ అవ్వాలని ట్రై చేస్తుంది రేఖ భోజ్. వైజాగ్ కి చెందిన ఈ భామ రెగ్యులర్ గా ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ, తన సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ, బోల్డ్ కామెంట్స్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం కూడా చేసిన ఆమె గతంలో బిగ్‌బాస్ రివ్యూలు కూడా చేసింది. తాజాగా ఆమె ఈరోజు ప్రారంభమైన ఒక తెలుగు సినిమా గురించి హాట్ కామెంట్స్ చేసింది. ఈరోజు అభిషేక్ నామా ‘నాగబంధం- ది సీక్రెట్ ట్రెజర్’ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. అభిషేక్ నామా కథ, స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్న ఈ సినిమాలో ‘పెదకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Oviya Leaked Video: హీరోయిన్ ప్రయివేట్ వీడియో లీక్.. లింక్ అడిగిన నెటిజన్ కి షాకింగ్ సమాధానం

ఆ సినిమా ఓపెనింగ్ ఫోటో షేర్ చేసిన రేఖ హీరోయిన్లు ఇద్దరినీ టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. వీళ్ళిద్దరి(హీరోయిన్లు) వల్ల ఒక పది టికెట్స్ కూడా ఎక్సట్రా తెగవు. అయినా సరే ఇలాంటి చిన్న projects కి కూడా తెలుగు అమ్మాయిలను కాదని flight tickets, Hotel bills and భారీ రెమ్యునరేషన్స్ ఇచ్చి మరీ వీళ్ళను తెచ్చుకుంటారు ఖర్మ…. మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఇంకో జన్మ ఎత్తినా మారరు. వీళ్ళింతే ఇక. చివరికి లాస్ట్ లైన్ హీరోస్ ఆయిన సుహాస్, కిరణ్ అబ్బవరం, రాజ్ తరుణ్, సంతోష్ శోభన్ లాంటి వాళ్ళ పక్కన కూడా తెలుగు అమ్మాయిలు లేరు అంటూ ఆమె కామెంట్ చేసింది. గత కొన్నాళ్లుగా ఆమె తెలుగు అమ్మాయిలకు తెలుగులో సరైన అవకాశాలు రావడం లేదనే అంశం మీద సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేస్తోంది.

Show comments