రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆగస్టు 15నాటికి 50రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది కల్కి. కల్కి రికార్డులు సృష్టిస్తుండగానే తన తదుపరి చిత్రాలతో డార్లింగ్ బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ‘రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే ఆ చిత్రం నుంచి విదులైన పోస్టర్స్ , గ్లింప్స్ భారీ అంచనాలు నెలకొల్పాయి. మిర్చి తరువాత అన్నీ యాక్షన్ సినిమాలు తీస్తున్న రెబల్ స్టార్ రాజా సాబ్ లో లవర్ బాయ్ గా కనిపించనున్నాడు. కాగా, ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ హారర్ గా సాగనుంది.
Also Read: Mega Star : మెగా సంబరాలకు సిద్ధం అవుతున్న ఫ్యాన్స్., కారణం ఇదే..?
ఇది ఇలా ఉంటే హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ భారీ పీరియాడిక్ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. . స్వాతంత్య్రానికి ముందు రజాకార్ల పాలనలో, బ్రిటిష్ నేపథ్యంలో జరిగిన కథాంశంతో ఈ సినిమా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడని వార్తలు వినిపించాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఆర్మీని స్థాపించి బ్రిటీష్ పాలకుల పై పోరాడారు. ఆ ఆర్మీలోనే ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి కీలక అప్ డేట్ తెలిపారు మూవీ మేకర్స్. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు రేపు జరగనున్నాయి . దీంతో ప్రభాస్ అభిమానులు ఇప్పుడు ఈ న్యూస్ తో ఫుల్ ఖుషీగా ఉన్నారు. భారీ విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న ప్రభాస్ వరుస సినిమా అప్ డేట్ లతో అభిమానులకు ట్రీట్ ఇస్తున్నాడు