గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “లవ్ రెడ్డి”. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి “లవ్ రెడ్డి” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా “లవ్ రెడ్డి” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది.
Also Reddy : Sri Vishnu: ‘స్వాతిముత్యం’తో శ్రీ విష్ణు సినిమా..
కాగా ఈ లవ్ రెడ్డి సినిమాకు టాలీవుడ్ సెలెబ్రెటీల అభినందల వెల్లువలా వస్తున్నాయి. నట సింహ నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా “లవ్ రెడ్డి” టైటిల్ పోస్టర్ ను రిలీజ్ అయిన ఈ సినిమా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రిలీజ్ నాడు ప్రేక్షకుల కోసం తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షోస్ ఏర్పాటు చేసి సినిమాను మరింతగా ఆడియెన్స్ లోకి తీసువెళ్లేలా చేసాడు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన లవ్ రెడ్డి మంచి ప్రశంశలు అందుకుంది. తాజాగా టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఈ లవ్ రెడ్డి చిత్ర యూనిట్ ను అభినందించారు. లవ్ రెడ్డి సినిమాకు అద్భుతమైన రిపోర్ట్స్ విన్నాను. చిత్ర యూనిట్ కు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ రెబల్ స్టార్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తమ సినిమాకు సపోర్ట్ చేయడం పట్ల యూనిట్ రెబల్ స్టార్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభాస్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.