NTV Telugu Site icon

SSMB-29: వీడియో లీక్.. రాజమౌళి గురి తప్పుతోందా..?

Ssmb

Ssmb

SSMB-29: దర్శక ధీరుడు రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో భారీ మూవీ వస్తోంది. ప్రస్తుతం ఒరిస్సాలోని కోరాపుట్ లోని కొండల నడుమ షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ కు సంబంధించిన చిన్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియలో లీక్ అయి నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహేశ్ బాబు నడుచుకుంటూ వస్తుంటాడు. పక్కనే ఓ విచిత్రమైన వీల్ చైర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ కూర్చుంటాడు. మహేశ్ బాబును మోకాళ్ల మీద కూర్చోబెడుతారు. అక్కడితో వీడియో ఎండ్ అయిపోతుంది. అసలు ఈ వీడియో ఎలా లీక్ అయింది. రాజమౌళి సినిమాలో ఒక చిన్న ఫొటో కూడా బయటకు రాదు కదా.. అలాంటిది ఏకంగా వీడియోనే బయటకు రావడంతో చాలా అనుమానాలు కలుగుతున్నాయి.

Read Also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసిన కోర్టు..

రాజమౌళి సినిమా నుంచి ఏది బయటకు రావాలన్నా సరే.. అఫీషియల్ గానే వస్తుంది. అంతే తప్ప లీక్ అవడం అనే మాటే ఉండదు. గత సినిమాలను చూస్తేనే ఇది తెలిసిపోతుంది. తన సినిమాలకు సీక్రెట్ ను, సస్పెన్స్ ను మెయింటేన్ చేయడంలో రాజమౌళి దిట్ట. అందుకే ఎస్ ఎస్ ఎంబీ-29 పూజా కార్యక్రమం విజువల్స్ కూడా బయటకు రాలేదు. అలాంటి రాజమౌళి ప్లానింగ్ ఇప్పుడు ఏమైంది అంటూ పోస్టులు పెడుతున్నారు. మొన్న మహేశ్ బాబు జిమ్ లో కష్టపడుతున్న ఫొటో కూడా బయటకు వచ్చింది. దాంతో మహేశ్ లుక్ ముందుగానే లీక్ అయింది.

Read Also: Vizag: ఎన్ఆర్ఐ మహిళ మృతి కేసులో బిగ్ ట్విస్ట్..

మూవీ షూటింగ్ పావు వంతు కూడా కాలేదు. అప్పుడే ఇందులో నటించే యాక్టర్స్ లిస్టు కూడా లీక్ అవుతోంది. దీంతో రాజమౌళి గురి తప్పుతోందా అనే అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. రాజమౌళి మెయింటేన్ చేసే సస్పెన్స్ లతోనే మూవీపై భారీ బజ్ క్రియేట్ చేస్తాడు. మొన్నటి వరకు ఈ సినిమాపై కూడా సస్పెన్స్ తోనే భారీగా హైప్ పెరిగింది. ఇప్పుడు లీకులు ఇవ్వడం అంటే.. ప్లాన్ లో భాగమా.. లేదంటే టెక్నికల్ టీమ్ పొరపాటా అనేది తెలియాల్సి ఉంది.