Site icon NTV Telugu

RC 16 : మైసూరుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Rc16

Rc16

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ను ముగించేసి తన తర్వాతి సినిమా స్టార్ట్ చేస్తున్నాడు చరణ్. RC16 గా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పీరియాడికల్ నేపథ్యంలో సాగే విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read : Ram Charan : ‘గేమ్‌ ఛేంజర్‌’ థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను కర్ణాటక లోని మైసూరులో అట్టహాసంగా స్టార్ట్ చేసాడు దర్శకుడు బుచ్చిబాబు. మైసూరులోని చాముండేశ్వరి మాత ఆలయంలో ఈ సినిమా స్క్రిప్ట్ ను అమ్మవారి చెంత ఉంచి ప్రత్యెక పూజలు చేపించారు. మైసూరులో దాదాపు 15 రోజులు పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో పాల్గొనేందుకు చిత్ర హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు హైదరాబాద్ నుండి మైసూర్ బయలుదేరారు. మాల ధారణలో ఉన్న చరణ్ ఎయిర్పోర్ట్ లో మాస్క్ ధరించి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు, ఈ సినిమా రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. సుకుమార్ రైటింగ్స్‌ మరియు సతీష్ కిలారు కు చెందిన వృద్ధి సినిమాస్ తో కలిసి బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ బ్యానర్‌పై ఆర్‌సి 16 చిత్రాన్ని భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు.

Exit mobile version