Rayavalasa : హీరోనే రైటర్, సింగర్! ‘రాయవలస’ ఫోక్ సెన్సేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో కొత్త టీమ్, కొత్త నిర్మాణ సంస్థతో సినిమా అంటే విడుదలయ్యే వరకు బిజినెస్ జరగడమే కష్టంగా ఉండే రోజులివి. కానీ ఆ లెక్కలన్నింటినీ తలకిందులు చేస్తూ విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది ‘రాయవలస’. తొలి ప్రయత్నంలోనే ఆంధ్రా, నైజాం ఏరియాలతో పాటు ఏకంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ డీల్స్‌ను కూడా క్లోజ్ చేసి ఈ చిత్రం ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. దీనికి తోడు తాజాగా విడుదలైన ‘నీతో ఓ అడుగు’ అనే ప్రేమ గీతం యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా దూసుకుపోతుండటంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో అసలైన హైలైట్ హీరో కార్తీక్ అని చెప్పాలి. సాధారణంగా ఇండస్ట్రీలో నటనతో పాటు పాటలు రాయడం, స్వయంగా పాడటం వంటి బహుముఖ ప్రతిభ ఉన్న హీరోలు చాలా అరుదుగా కనిపిస్తారు. కార్తీక్ తన తొలి సినిమా ‘రాయవలస’తోనే ఆ అరుదైన ఫీట్ సాధించాడు. తాజాగా విడుదలై శ్రోతలను కట్టిపడేస్తున్న ‘నీతో ఓ అడుగు’ పాటకు కార్తీక్ స్వయంగా సాహిత్యం అందించడమే కాకుండా, తన గొంతుతో ఆలపించడం విశేషం. ఆయన గాత్రానికి ప్రముఖ సింగర్ రమ్య బెహరా మధురమైన వాయిస్, అర్జున్ బాల అందించిన మెలోడీ ట్యూన్ తోడవడంతో ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘రింగుడు రింగుడు’, ‘జాతర’ వంటి మాస్, ఫోక్ పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. వాటికి పూర్తి భిన్నంగా ఇప్పుడు ఒక క్లాసీ రొమాంటిక్ మెలోడీతో దర్శకురాలు రాధిక జయంతి మ్యాజిక్ చేశారు. సముద్ర తీరంలో (బీచ్ బ్యాక్‌డ్రాప్) హీరో కార్తీక్, హీరోయిన్ శ్రీష నులు మధ్య చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలు 90ల నాటి స్వచ్ఛమైన ప్రేమ గీతాలను గుర్తుచేస్తున్నాయి. సినిమాటోగ్రాఫర్ కిట్టు ప్రతి ఫ్రేమ్‌ను ఒక అందమైన పెయింటింగ్‌లా చూపించగా, రాజ్ పైడే కొరియోగ్రఫీ పాటలోని ఫీల్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమాను తీర్చిదిద్దారు. తొలి సినిమా అయినప్పటికీ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే స్వదేశీ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్ హక్కులను ‘సినీ గోల్డ్ ఎంటర్టైన్మెంట్స్’ సొంతం చేసుకోవడం విశేషం. నిర్మాత గోపి కృష్ణ జయంతి, దర్శకురాలు రాధిక జయంతి విజన్‌కు ఈ ప్రీ-రిలీజ్ బిజినెస్ నిదర్శనంగా నిలుస్తోంది. డిసెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ‘రాయవలస’.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!
Also Read
- Krithi Shetty: 'జనవరి 12 విడుదల'.. హిట్ తప్పనిసరి!
- Kavya-Anirudh Reception: సీఎం విజయ్‌తో కలిసి రాని సంగీత.. అనిరుధ్-కావ్య రిసెప్షన్లో విడివిడిగా కనిపించిన దంపతులు
- Ramayana Box Office Collection: ‘రామాయణ’ రికార్డుల వేట.. 17 రోజుల్లోనే రూ.1,675 కోట్లు.. డే వైజ్ కలెక్షన్స్ ఇవే!
- Rakul Preet Singh: టాలీవుడ్ అన్నీ ఇచ్చింది.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ కామెంట్స్!
తాజావార్తలు
-
Motorola G Max: రూ.19,499కే Motorola G Max 5G ఫోన్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదిరిపోయే డీల్!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Krithi Shetty: ‘జనవరి 12 విడుదల’.. హిట్ తప్పనిసరి!
-
December 2026 Wedding Dates: డిసెంబర్లో పెళ్లి బాజాలు మోగేది ఈ తేదీల్లోనే.. 16 నుంచి శుభకార్యాలకు బ్రేక్
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
ట్రెండింగ్
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!