NTV Telugu Site icon

Dhanush : రాయన్ సెన్సార్ టాక్..ఎలా ఉందంటే ..?

Untitled Design (8)

Untitled Design (8)

ధనుష్ హీరోగా రాబోతున్న తాజా చిత్రం రాయన్. తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ్ తో పాటు, తెలుగు, హిందీ భాషలలో రానుంది. ఈ చిత్రంలో ధనుష్ తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించనున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా రానున్న జూలై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ధనుష్ కెరీర్ లో రాయన్ 50వ చిత్రంగా రాబోతుంది. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచాయి.

కాగా ఈ చిత్రానికి సంబంధించి తెలుగు వర్షన్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది ఈ చిత్రం. సెన్సార్ టీమ్ సభ్యులు చిన్న చిన్న కట్స్ తో ఈ చిత్రానికి “A” సర్టిఫికెట్ జారీ చేశారు. రాయన్ లో హింసను ప్రేరేపించే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, రక్తం, ఘర్షణలు వంటి దృశ్యాలు ఎక్కువగా ఉండడంతో కొన్నిటిని తొలగించాలని సూచనలు చేసారని టాక్. కాగా A సర్టిఫికెట్ పొందిన కారణంగా 18లోపు వయసు గల వారికి ఈ చిత్రాన్ని ప్రదర్శించడం నిషేధం. ఇదిలా ఫైనల్ కాపీ చూసిన సెన్సార్ టీమ్ సభ్యులు రాయన్ యూనిట్ కు సుబ అభినందలు తెలిపారని, ధనుష్ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారని యూనిట్ వర్గాల సమాచారం. ధనుష్ఈ చిత్రంలో పోలీస్ ఇన్ఫార్మర్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ధనుష్ దర్శకత్వం వహించిన మొట్ట మొదటి చిత్రమయిన రాయన్ ను సన్ పిక్టర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తుండగా ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Also Read: Chaitanya Reddy : హనుమాన్ కు మేము అనుకున్నంత కలెక్షన్లు రాలేదు..

Show comments