NTV Telugu Site icon

Raviteja: ఇరగదీయ్యబోతున్నాం తమ్ముళ్లూ.. గెట్ రెడీ

Raviteja

Raviteja

Raviteja: మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూల్ లో గ్రాండ్ గా జరుగుతుంది. ఆసక్తికరంగా ఎప్పుడూ చివరి మాట్లాడే హీరో ఈసారి మాత్రం కాస్త ముందుగానే మాట్లాడారు. హరీష్ కంటే ముందు నేనే మాట్లాడాలని ముందుకు వచ్చాను మైక్ ని బాగా వాడగల వాళ్ళలో హరీష్ కూడా ఒకరు అని చెప్పుకొచ్చాడు. ముందుగా సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరినీ పేరుపేరునా పలకరిస్తూ వాళ్ళందరికీ థాంక్స్ చెప్పాడు రవితేజ. ఈ సినిమా మీకు ప్రతి బ్లాక్ సినిమా అంతా కలర్ ఫుల్ గా అందంగా లడ్డూలా ఉంటుంది. అది మీకు 14వ తేదీ సాయంత్రం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అని చెప్పుకొచ్చాడు.

 
నటీనటులను కూడా పేరుపేరునా పలకరిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇప్పటికే చాలా లేట్ అయింది అంటూ మొదలుపెట్టి భాగ్యశ్రీ గురించి మాట్లాడుతూ ఇప్పటికే ఒక ఊపు ఊపేస్తోంది కదా. ఎలా ఉంది అని అడిగితే ఆడియన్స్ నుంచి గట్టి రెస్పాన్స్ వచ్చింది. అది మా ఫీలింగ్ కూడా అదే రేపు సినిమాలో ఆ అమ్మాయి పాత్ర కూడా మామూలుగా ఉండదు చాలా బాగా చేసింది అని పేర్కొన్నాడు. ఇక హరీష్ శంకర్ గురించి మాట్లాడుతూ ఏం చెప్పను, ఎన్ని చెప్పను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను మేము ఇద్దరం ఒకరి గురించి ఒకరు ఎలివేషన్ ఇచ్చుకోవడం సరిపోతుంది అని అన్నారు. 14వ తారీకు సాయంత్రం నుంచి ఇరగదీయ్యబోతున్నాం ఆల్రెడీ ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి తమ్ముళ్లు అని పేర్కొన్నారు.

Show comments