మాస్ మహారాజా ‘రవితేజ’ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా.. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. రవితేజ సరసన హాట్ భామలు డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ కానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచారంలో వేగం పెంచింది. ఈ క్రమంలో ఓ సాంగ్‌ను విడుదల చేసింది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా నుంచి ‘వామ్మో వాయ్యో’ లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. హాట్ బ్యూటీస్ ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతిలతో కలిసి మాస్ మహారాజా వేసిన స్పెట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముగ్గురి స్టైలిష్ లుక్ బాగున్నాయి. హీరోయిన్స్ గ్లామర్ పాటకు మరింత హెల్ప్ అయిందనే చెప్పాలి. ఈ పాటకు దేవ్ పవార్ సాహిత్యం అందించగా.. స్వాతిరెడ్డి యూకే ఆలపించారు. ఇటీవల వరుస హిట్స్ ఇస్తున్న భీమ్స్ సిసిరోలియా సంగీతం అందించారు. శేఖర్ వీజే కోరియోగ్రఫీ అద్భుతంగా ఉంది.
