Ravi Teja : సెంటిమెంట్స్‌ను పట్టించుకోని రవితేజ.. చైల్డ్‌ సెంటిమెంట్ హిట్‌ తీసుకొస్తుందా?

Irumudi Raviteja

Irumudi Raviteja

మాస్ మహారాజా రవితేజ ఎప్పుడూ సినిమాల విషయంలో ఏలాంటి సెంటిమెంట్లనూ పట్టించుకోరు. ఫ్లాపుల్లో ఉన్న దర్శకులకు, కలిసిరాని హీరోయిన్లకు కూడా మళ్లీ అవకాశాలు ఇస్తుంటారు. అలాగే తనతో హిట్స్ ఇచ్చిన ఫామ్‌లో ఉన్న డైరెక్టర్లతోనూ కొత్త ప్రాజెక్టులు చేస్తుంటారు. ప్లాప్స్ ఎదురైనా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుస సినిమాలతో దూసుకెళ్లడం రవితేజ నైజం.అయితే రవితేజ చాలా కాలంగా డల్ గా సాగుతోంది. 2022లో వచ్చిన ‘ధమాకా’ చిత్రం తర్వాత రవితేజ ఖాతాలో ఆ స్థాయి బిగ్గెస్ట్ హిట్ పడలేదు. ఈ క్రమంలోనే మాస్ రాజా తన తదుపరి చిత్రం ద్వారా ఎలాగైనా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం ఇరుముడి. ఈ సినిమా తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఈ నెల 21న గ్రాండ్‌గా విడుదల కానుంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో రవితేజ – పాప సెంటిమెంట్ ఏ స్థాయిలో వర్కవుట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ భావోద్వేగాలు థియేటర్లలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. మళ్లీ చాలా కాలం తర్వాత ‘ఇరుముడి’ చిత్రంతో బలమైన తండ్రీ-కూతుళ్ల ఎమోషన్‌తో రవితేజ ముందుకు వస్తున్నారు. మరి ఈ చైల్డ్ సెంటిమెంట్ మాస్ రాజాకు మళ్లీ ఆ స్థాయి గ్రాండ్ హిట్‌ను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి. తమిళ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీస్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది.