Site icon NTV Telugu

Ravi Teja : అది దా సర్ప్రైజ్..మాస్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన కేతిక శర్మ !

Ketikasharma

Ketikasharma

ప్రజంట్ ఫుల్ ఫామ్‌లో ఉన్న యంగ్ హీరోయిన్‌లలో కేతిక శర్మ ఒకరు. కెవలం టాలీవుడ్ లోనే హీరోయిన్‌గా అవకాశాలను అందుకునే ప్రయత్నం చేస్తూ తన కెరియర్‌ను సక్సెస్ బాటలో నడిపించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐదేళ్ల పాటు ఓపిగ్గా స్ట్రాంగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న కేతికా శర్మ‌.. ‘అది దా సర్ ప్రైజ్’ అంటూ ఒకె ఒక్క స్పెషల్ సాంగ్‌తో దుమ్ములేపింది. ఇప్పుడు ఏకంగా వరుస పెట్టి సినిమా అవకాశాలను తన సొంతం చేసుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా మరో టాలీవుడ్ స్టార్ హీరోతో కూడా ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ..

Also Read : Karthi : ‘సర్దార్ 2’ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్!

మాస్ రాజా రవితేజ హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ‘మాన్ జాతర’ అనే మూవీ షూటింగ్ లో బిజీగా ఉండగా.. ఈ సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని లైన్‌లో పెట్టారు రవితేజ. కాగా ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్‌లకు అవకాశముండగా.. ఇందులో కేతిక శర్మను ఖరారు చేసినట్లు సమాచారం. అంతే కాదు ఇప్పటికే ఈ చిత్ర యూనిట్, ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్లు జరిపారట. ఇక ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రం జూలై నుంచి చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు టాక్. అలాగే ఈ సినిమాకు ‘అనార్కలి’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

Exit mobile version