Raviteja : మాస్ రాజా పవర్ మరోసారి చూపించేందుకు ఏర్పాట్లు…
- ప్రస్తుతం బాలయ్యతో వీరమాస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న బాబీ
- రవితేజ కెరీర్ లో 75వ బాబీ సినిమా
- ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ విడుదలకు ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ రాజా రవితేజ, హరిష్ శంకర్ కలయికలో ”మిస్టర్ బచ్చన్” అనే చిత్రం రాబోతోన్న విషయం తెలిసిందే. గతంలో హరీష్ శంకర్, రవితేజ కాంబోలో మిరపకాయ్ లాంటి సూపర్ హిట్ చిత్రం వచ్చింది. దీంతో అభిమానులు మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ చిత్రంలోని సితార్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా ప్రేక్షకుల నుండి విశేష స్పందన రాబట్టి, సోషల్ మీడియాలో టాప్ లో ట్రేండింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు మాస్ రాజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ షూటింగ్ లో బిజీగా ఉంటూనే పలు కథలు వింటుంటున్నాడని తెలుస్తోంది. ఆ దశలోనే యంగ్ డైరెక్టర్ బాబీ చెప్పిన పాయింట్ రవితేజకు నచ్చిందని ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని అన్నట్టు వార్తలు వినవస్తున్నాయి. బాబీ దర్శకత్వంలో గతంలో ‘పవర్’ అనే సూపర్ హిట్ చిత్రంలో నటించాడు రవితేజ. తన సినీ కెరీర్ 75వ సినిమాగా బాబీ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది . ప్రస్తుతం బాబీ నందమూరి బాలయ్యతో “వీరమాస్” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
Also Read
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
- Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని 'రణబాలి'తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
బాలయ్య సినిమా పూర్తయిన వెంటనే బాబీ, రవితేజ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. ఈ సినిమాను కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే ఆలోచన చేస్తున్నట్టు వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న మిస్టర్ బచ్చన్ ఈ నెలాఖరుకు షూటింగ్ కంప్లీట్ చేసి ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
తాజావార్తలు
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!