NTV Telugu Site icon

Raviteja : మాస్ రాజా పవర్ మరోసారి చూపించేందుకు ఏర్పాట్లు…

Untitled Design (7)

Untitled Design (7)

మాస్ రాజా ర‌వితేజ, హరిష్ శంకర్ కలయికలో ”మిస్ట‌ర్ బ‌చ్చన్” అనే చిత్రం రాబోతోన్న విషయం తెలిసిందే. గతంలో హరీష్ శంకర్, రవితేజ కాంబోలో మిరపకాయ్ లాంటి సూపర్ హిట్ చిత్రం వచ్చింది. దీంతో అభిమానులు మిస్ట‌ర్ బ‌చ్చన్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించడం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా ఈ చిత్రంలోని సితార్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా ప్రేక్షకుల నుండి విశేష స్పందన రాబట్టి, సోషల్ మీడియాలో టాప్ లో ట్రేండింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు మాస్ రాజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ షూటింగ్ లో బిజీగా ఉంటూనే పలు కథలు వింటుంటున్నాడని తెలుస్తోంది. ఆ దశలోనే యంగ్ డైరెక్ట‌ర్ బాబీ చెప్పిన పాయింట్ రవితేజకు నచ్చిందని ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని అన్నట్టు వార్తలు వినవస్తున్నాయి. బాబీ దర్శకత్వంలో గతంలో ‘పవర్’ అనే సూపర్ హిట్ చిత్రంలో నటించాడు రవితేజ. తన సినీ కెరీర్ 75వ సినిమాగా బాబీ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది . ప్రస్తుతం బాబీ నందమూరి బాలయ్యతో “వీరమాస్” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

బాలయ్య సినిమా పూర్తయిన వెంటనే బాబీ, రవితేజ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. ఈ సినిమాను కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే ఆలోచన చేస్తున్నట్టు వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న మిస్టర్ బచ్చన్ ఈ నెలాఖరుకు షూటింగ్ కంప్లీట్ చేసి ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.