Site icon NTV Telugu

Raviteja: స్టార్ హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం!

Ravitejafather

Ravitejafather

సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మరణం మరవక ముందే అలనాటి నటి సరోజ మరణం అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 90 సంవత్సరాలు. నిన్న రాత్రి రవితేజ నివాసంలో ఆయన కన్నుమూసినట్లు సమాచారం.

Also Read:Kingdom : అన్నదమ్ములుగా విజయ్, సత్యదేవ్.. సాంగ్ ప్రోమో రిలీజ్..

రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ వృత్తిరీత్యా ఫార్మసిస్ట్ గా పని చేసేవారు. ఆయన వృత్తిరీత్యా పలు ప్రాంతాలలో ఉద్యోగం చేయాల్సి రావడంతో తాను అనేక ప్రాంతాలు చిన్నప్పుడే తిరగాల్సి వచ్చిందని రవితేజ పలు సందర్భాలలో పంచుకున్నారు. ఇక రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు. వారిలో ఒకరు రవితేజ కాగా మరొకరు రఘు, అలాగే భరత్ రాజు. ఇక భూపతి రాజు రాజగోపాల్ రాజు స్వగ్రామం ఆంధ్ర ప్రదేశ్ లోని జగ్గంపేట. ఉద్యోగ రీత్యా ఆయన అనేక ప్రాంతాలలో పనిచేస్తూ వచ్చారు. ఒకరకంగా అలా అనేక ప్రాంతాలలో పనిచేస్తూ రావడంతోనే రవితేజకు అనేక యాసలు ఒంటబట్టాయని కూడా సన్నిహితులు చెబుతూ ఉంటారు.

Exit mobile version