Site icon NTV Telugu

Raviteja: ఇది కదా డెడికేషన్ అంటే.. గాయంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లే ముందు షూట్..

Raviteja

Raviteja

మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్ జతర’. రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.’మాస్ జతర’ సినిమా, భారీ అంచనాల నడుమ అక్టోబర్ 31న థియేటర్లలో అడుగుపెట్టనుంది. విడుదల తేదీ సమీపిస్తుండటంతో తాజాగా సుమతో ఇంటర్వ్యూలో రవితేజ, శ్రీలీల కీలక విషయాలు పంచుకున్నారు. రవితేజ ఈ సినిమాలో తాను పోషించిన ఆర్‌పిఎఫ్(రైల్వే పోలీస్ ఫోర్స్) అధికారి పాత్ర గురించి మాట్లాడుతూ, ఇది తన సినీ ప్రయాణంలో సరికొత్త ప్రత్యేకమైన పాత్ర అని అభివర్ణించారు.

Also Read: Kantara: మూలాలు మరచిన రష్మిక.. వేనోళ్ళ పొగుడుతుంటే స్పందించడానికి నొప్పా?

అలాగే చిత్ర దర్శకుడు భాను భోగవరపు, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోపై ప్రశంసలు కురిపించారు. భాను ప్రతిభావంతుడని, చిత్రీకరణ సమయంలో కూడా సన్నివేశాన్ని ఇంకా మెరుగ్గా మలచడానికి ప్రయత్నిస్తుంటాడని, చాలా వేగంగా మార్పులు చేయగలడని కొనియాడారు. భీమ్స్ ఎంతో కృషి చేసి, ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడని అన్నారు. ఇక రవితేజ గారితో కలిసి నటించడం చాలా ఆనందకరమైన అనుభవమని శ్రీలీల అన్నారు. రవితేజ గారితో కలిసి పనిచేయడం చాలా సులభంగా ఉంటుందని, అత్యంత ఆహ్లాదకరమైన సహనటులలో ఆయన ఒకరని శ్రీలీల తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మాస్ జతారలో తాను సైన్స్ టీచర్‌గా, శ్రీకాకుళం యాసలో మాట్లాడే ఉల్లాసభరితమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తానని ఆమె వెల్లడించారు. తన మునుపటి పాత్రలకు పూర్తి భిన్నంగా ఇది ఉంటుంది. స్క్రిప్ట్ చదివినప్పుడే తాను నవ్వుకున్నానని, ఇక సెట్ లో దానిని ప్రదర్శించే సమయంలో ఆ నవ్వులు రెట్టింపు అయ్యాయని శ్రీలీల పేర్కొన్నారు. రవితేజ అంకితభావం గురించి మాట్లాడుతూ.. గాయంతో బాధపడుతున్నప్పటికీ, ఆయన ఆసుపత్రికి వెళ్లే ముందు ‘తూ మేరా లవర్’ పాటను పూర్తి చేసి, తన నిబద్ధతను చాటుకున్నారని శ్రీలీల కొనియాడారు.

Exit mobile version