ఒకపక్క యంగ్ హీరోలతో, మరోపక్క సీనియర్ హీరోలతో పోటాపోటీగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు రవితేజ. ప్రస్తుతం సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో, కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా పేరు ఫిక్స్ చేయలేదు కాబట్టి, రవితేజ 76వ సినిమాగా సంబోధిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది.
Also Read:The Raja Saab: ఒక్క సెట్.. ఎన్నో స్పెషాలిటీలు!
హైదరాబాద్‌లో సినిమా కోసం నిర్మించిన ప్రత్యేకమైన సెట్‌లో షూటింగ్ మొదలుపెట్టారు. రవితేజ సహా ఇతర కీలక పాత్రలలో నటిస్తున్న నటీనటులు అందరూ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారని తెలుస్తోంది. ఇది సినిమాకు సంబంధించిన ఒక కీలక షెడ్యూల్ అని సమాచారం.
కిషోర్ తిరుమల సెన్సిబిలిటీస్, రవితేజ మార్క్ కామిక్ టైమింగ్ రెండూ మిక్స్ చేసి, ఈ సినిమాను సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Also Read: The Raja Saab: ఒక్క సెట్.. ఎన్నో స్పెషాలిటీలు!
రవితేజ ఈ సినిమా కోసం చాలా స్టైలిష్‌గా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. భీమ్స్ సంగీతం అందిస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా ఈ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. అయితే, హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా టీమ్ ఫిక్స్ చేయలేదు. పలువురు హీరోయిన్‌లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
