Rashmika Mandanna’s Mysaa Postponed: నేషనల్ క్రష్ రష్మిక మందన్న అభిమానులకు బ్యాడ్ న్యూస్. జయమ్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’ విడుదల వాయిదా పడింది. ఈ నెల 27న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా.. పోస్ట్‌పోన్ అయింది. అనుకున్న తేదీకి మైసాను విడుదల చేయడం లేదని నిర్మాణ సంస్థ అన్‌ఫార్ములా ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. కొత్త విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.
తెలుగు సినిమా ప్రస్తుతం అద్భుతమైన సాంకేతిక ప్రమాణాలతో కొత్త దశలోకి అడుగుపెడుతోందని, ఈ వారం విడుదలైన సినిమాలు కూడా అత్యుత్తమ నిర్మాణ విలువలు, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పేర్కొంది. ఇదే స్థాయిలో మైసాను కూడా సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో, ప్రేక్షకులకు గొప్ప బిగ్‌స్క్రీన్ అనుభూతిని అందించేలా రూపొందించాలని తాము భావిస్తున్నట్లు తెలిపింది. సినిమా విషయంలో ఎలాంటి రాజీ పడకుండా తాము అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే నవంబర్ 27న జరగాల్సిన థియేట్రికల్ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. కొత్త విడుదల తేదీని అతి త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. .
మైసా నుంచి ఇప్పటికే విడుదలైన ‘ఒసేయ్ రాములమ్మ’ పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా వాయిదా పడటం రష్మిక అభిమానులకు కొంత నిరాశ కలిగించినప్పటికీ.. మరింత నాణ్యమైన చిత్రాన్ని అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చిత్ర బృందం పేర్కొంది. మైసా కొత్త రిలీజ్ డేట్‌ను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. ఇక రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మికతో పాటు సముద్రఖని, రావు రమేశ్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

