Site icon NTV Telugu

Rashmika Mandanna: ‘మైసా’ మొదలెడుతున్న రష్మిక

Mysaa Movie

Mysaa Movie

ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది రష్మిక. ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. కొత్తగా మరో కొత్త సినిమా ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఆమె హీరోయిన్గా మైసా అనే సినిమా రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు నుంచి రష్మిక ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా రక్తంతో ముఖం, చేతిలో ఆయుధం, ముక్కుపుడకతో ఆమె లుక్ చూసిన అంతా షాక్ అయ్యారు. ‘ధైర్యం ఆమె బలం..ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి..’ అంటూ ఇచ్చిన హైప్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక..‘మైసా’ అనే టైటిల్ అనౌన్స్ చేయగానే అందరిలోనూ ఓ ఆసక్తి నెలకొంది. అసలు మైసా అంటే ఏంటి?

‘మైసా’ అనే పదం వివిధ భాషల మూలాల నుంచి తీసుకున్నారు. స్వీడిష్, అరబిక్, జపనీస్, జార్జియన్ భాషల్లో ‘మైసా’ అనే పదానికి ‘తల్లి’ (Mother) అని అర్థం. స్వేచ్ఛా భావాలతో, సహజ నాయకత్వంలో ముందుకు సాగిన ఓ సాహసవంతురాలి పాత్రకు ఇది సరైన టైటిల్ అని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో రష్మిక వారియర్ మదర్ గా కనిపించనున్నారు. గోండు తెగ నేపథ్యం ఆధారంగా ఈ కథ సాగనుంది. ఈ తెగల హక్కుల కోసం పోరాడే ఓ తల్లిగా, నాయకురాలిగా రష్మిక పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం.

Exit mobile version