Site icon NTV Telugu

Kubera: ఈ సినిమాతో నా కల నెరవేరింది.. రష్మిక

Rashmika, Kunera

Rashmika, Kunera

అక్కినేని నాగార్జున, ధనుష్‌, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేర’. శేకర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 20న రిలీజ్ కాబోతుంది. సినిమా‌పై మంచి బజ్ ఉండగా.. ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక అప్ డేట్ ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా జనంలోకి బాగా వెళ్లింది. స్టోరీ ఎక్కడ కూడా అర్థం కాకుండా ట్రైలర్ బాగా కట్ చేశారు.

Also Read: Plane Crash : అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్‌.. దర్శకుడు మిస్సింగ్

ఈ.. ఈవెంట్‌‌లో భాగంగా రష్మిక మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.. ‘నా సినీ ప్రయాణానికి సంబంధించి ఇక్కడ ప్రదర్శించిన వీడియో చూస్తే భయమేసింది. ఇన్ని రోల్స్‌ ప్లే చేశానా ? అనే ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా ఒక సినిమా పూర్తవడానికి ఏడాది పడుతుంది. ఆ సమయంలో చిత్ర బృందంతో క్లోజ్‌ అవుతుంటాం. అలా ఒక మూవీ ప్రయాణం నేను నా ఫ్యామిలిలా ఫీల్ అవుతా. ఇక శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో మూవీ చేయలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది. రియల్‌ లొకేషన్స్‌లోనే ఆయన షూటింగ్‌ చేస్తారు. నాగార్జున సర్‌తో నేను నటించిన రెండో చిత్రమిది. ఆయన మంచి నటుడే కాదు మంచి వ్యక్తి కూడా. ధనుష్‌తో ఇది నా మొదటి సినిమా మాత్రమే.. మరిన్ని సినిమాల్లో నటించాలనుంది. ఈ చిత్రంలోని మా కెమిస్ట్రీ ఆ అవకాశాలు అందిస్తుందనుకుంటున్నా’ అని రష్మిక తెలిపింది. మొత్తానికి ఈ సినిమాలో రష్మిక బలమైన పాత్రలో కనిపించించనుందని తెలుస్తోంది.

Exit mobile version