విజయ్ దేవరకొండ – రశ్మిక మధ్య ఏం లేదట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిప్పులేనిదే పొగ రాదంటారు. కానీ బాలీవుడ్ మీడియా మాత్రం నిప్పు లేకుండానే ఎఫైర్స్ విషయంలో పొగను సృష్టించేస్తుంటుంది. కలిసి సినిమాలో నటిస్తే చాలు ఆ హీరోహీరోయిన్లకు అఫైర్స్ అంటగట్టేస్తారు. కానీ చిత్రం ఏమంటే… విజయ్ దేవరకొండ – రశ్మిక మందణ్ణ మధ్య మాత్రం అలాంటి సమ్ థింగ్స్ ఏమీ లేవని, వాళ్ళు జస్ట్ క్లోజ్ అండ్ స్పెషల్ ఫ్రెండ్స్ మాత్రమేనని బాలీవుడ్ మీడియా సర్టిఫికెట్ ఇచ్చేసింది.
‘గీత గోవిందం’లో తొలిసారి కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రశ్మిక మధ్య కెమిస్ట్రీ సూపర్ గా వర్కౌట్ అయ్యి మూవీని సూపర్ డూపర్ హిట్ చేసేసింది. కానీ అదే ఊపుతో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేకపోయింది. అదే సమయంలో రశ్మిక మందణ్ణ వరుసగా సినిమాలు చేస్తూ తన ఎంగేజ్ మెంట్ ను రద్దు చేసుకోవడంతో విజయ్ దేవరకొండకు ఆమెకు మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైంది. ఈ విషయమై రశ్మిక వెంటనే క్లారిటీ ఇచ్చింది. విజయ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉండటం, రశ్మిక సైతం రెండు హిందీ సినిమాలకు కమిట్ అయ్యి, వాటి షూటింగ్స్ కోసం అక్కడే మకాం పెట్టడం, ఆ సందర్భంగా వీరిద్దరూ కలుసుకోవడంతో మళ్ళీ పాపరాజిలకు పని దొరికినట్టైంది. దాంతో కొందరు వారి మధ్య రిలేషన్ పై దృష్టి పెట్టారు. ముంబై నుండి షూటింగ్స్ నిమిత్తం రశ్మిక హైదరాబాద్ వచ్చినా తొలుత విజయ్ దేవరకొండనే కలుస్తుండటం కూడా వారిపై ప్రచారం జోరందుకోవడానికి కారణమైంది. ఏదేమైనా… వారిద్దరూ మంచి స్నేహుతులు తప్పితే వారి మధ్య ఇంకేం లేదని ఉత్తరాది మీడియా భావిస్తోంది. నిజానికి విజయ్ దేవరకొండ కూడా ఏ విషయంలో అయినా గోప్యత పాటించకుండా, బాహాటంగానే మాట్లాడతాడు. సో… ఉత్తరాది మీడియా ఊహాగానాలూ వాస్తవమే అనుకోవచ్చు.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!