NTV Telugu Site icon

విజయ్ దేవరకొండ – రశ్మిక మధ్య ఏం లేదట!

నిప్పులేనిదే పొగ రాదంటారు. కానీ బాలీవుడ్ మీడియా మాత్రం నిప్పు లేకుండానే ఎఫైర్స్ విషయంలో పొగను సృష్టించేస్తుంటుంది. కలిసి సినిమాలో నటిస్తే చాలు ఆ హీరోహీరోయిన్లకు అఫైర్స్ అంటగట్టేస్తారు. కానీ చిత్రం ఏమంటే… విజయ్ దేవరకొండ – రశ్మిక మందణ్ణ మధ్య మాత్రం అలాంటి సమ్ థింగ్స్ ఏమీ లేవని, వాళ్ళు జస్ట్ క్లోజ్ అండ్ స్పెషల్ ఫ్రెండ్స్ మాత్రమేనని బాలీవుడ్ మీడియా సర్టిఫికెట్ ఇచ్చేసింది.

‘గీత గోవిందం’లో తొలిసారి కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రశ్మిక మధ్య కెమిస్ట్రీ సూపర్ గా వర్కౌట్ అయ్యి మూవీని సూపర్ డూపర్ హిట్ చేసేసింది. కానీ అదే ఊపుతో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేకపోయింది. అదే సమయంలో రశ్మిక మందణ్ణ వరుసగా సినిమాలు చేస్తూ తన ఎంగేజ్ మెంట్ ను రద్దు చేసుకోవడంతో విజయ్ దేవరకొండకు ఆమెకు మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైంది. ఈ విషయమై రశ్మిక వెంటనే క్లారిటీ ఇచ్చింది. విజయ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘లైగర్’ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉండటం, రశ్మిక సైతం రెండు హిందీ సినిమాలకు కమిట్ అయ్యి, వాటి షూటింగ్స్ కోసం అక్కడే మకాం పెట్టడం, ఆ సందర్భంగా వీరిద్దరూ కలుసుకోవడంతో మళ్ళీ పాపరాజిలకు పని దొరికినట్టైంది. దాంతో కొందరు వారి మధ్య రిలేషన్ పై దృష్టి పెట్టారు. ముంబై నుండి షూటింగ్స్ నిమిత్తం రశ్మిక హైదరాబాద్ వచ్చినా తొలుత విజయ్ దేవరకొండనే కలుస్తుండటం కూడా వారిపై ప్రచారం జోరందుకోవడానికి కారణమైంది. ఏదేమైనా… వారిద్దరూ మంచి స్నేహుతులు తప్పితే వారి మధ్య ఇంకేం లేదని ఉత్తరాది మీడియా భావిస్తోంది. నిజానికి విజయ్ దేవరకొండ కూడా ఏ విషయంలో అయినా గోప్యత పాటించకుండా, బాహాటంగానే మాట్లాడతాడు. సో… ఉత్తరాది మీడియా ఊహాగానాలూ వాస్తవమే అనుకోవచ్చు.