రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ రిలేషన్‌షిప్‌పై సినీ పరిశ్రమలో, సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతూనే ఉంది. వీరు నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలు వచ్చినా, వాటిని ఈ జంట అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ నేపథ్యంలో, రష్మిక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు తెలివిగా స్పందించి, మళ్లీ వార్తల్లో నిలిచింది. సమంత పెళ్లి వ్యవహారం వార్తల్లో ఉన్న సమయంలోనే, రష్మిక, విజయ్ దేవరకొండల వివాహం గురించిన ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. నెటిజన్లు “రష్మిక, విజయ్ పెళ్లెప్పుడు?” అంటూ ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగినా, లవర్స్ ఇంకా బైటకు చెప్పడం లేదు. ఇటీవల ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా సక్సెస్ మీట్‌లో, విజయ్ దేవరకొండ రష్మిక చేతిని ముద్దాడటం వారి బంధాన్ని మరింత బలంగా చూపించింది. వచ్చే ఫిబ్రవరిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.
Also Read :Ambati Rambabu: షిప్‌ని సీజ్ చేశారా? రేషన్ మాఫియాని అరికట్టారా?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావన రాగా, రష్మిక చాలా జాగ్రత్తగా, తెలివిగా మాట్లాడింది. “రూమర్స్‌ను ఖండించలేను… అలాగే ధ్రువీకరించలేను. పెళ్లి గురించి ఎప్పుడు, ఎక్కడ మాట్లాడాలో అప్పుడే మాట్లాడతాను. కచ్చితంగా మీ అందరితో పంచుకుంటాను.” ఈ సమాధానం ద్వారా, ఆమె రూమర్స్‌ను కొట్టిపారేయకుండా పరోక్షంగా ధ్రువీకరించినట్లైందని నెటిజన్లు అంటున్నారు. రష్మిక తరహాలోనే, బాలీవుడ్ నటి జాన్వి కపూర్ కూడా తన ప్రేమ వ్యవహారం గురించి పెదవి విప్పడం లేదు. జాన్వి కపూర్, శిఖర్ పహారియా గత పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ జంట తరచుగా ఆలయాలకు వెళ్తోంది. అయితే వారు లవర్స్‌లా కాకుండా.. దంపతుల్లా ప్రవర్తిస్తున్న తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మొత్తంగా, విజయ్-రష్మిక, జాన్వి-శిఖర్.. ఈ రెండు జంటలు ప్రేమలో మునిగితేలుతున్నా, తమ పెళ్లి ఊసును మాత్రం ఇంకా అధికారికంగా బయటపెట్టకుండా అభిమానులను ఉత్కంఠలో ఉంచుతున్నాయి.
