Rashmika Mandanna: ‘పుష్ప’ సినిమా అంటూనే మనకు గుర్తుకు వచ్చేది శ్రీవల్లి. కన్నడ బ్యూటీ రశ్మికా మందణ్ణ పుష్ప సినిమాలో నటించిన శ్రీవల్లి పాత్ర అందిరిని ఆకట్టుకుంది. సామీ సామీ అంటూ నడుము ఊపుతూ వేసిన స్టెప్పులు కుర్రాళ్లను ఆకట్టుకుంది. దీంతో ఈమె కెరీర్ ఇంకా పుంజుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ అవకాశాలు అందుకుంటోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా.. తన విపరీతమైన క్రేజ్ కు తగ్గట్టుగానే పారితోషికం భారీగా పెంచేసింది. ‘పుష్ప’ కంటే ముందు రశ్మికా మందణ్ణ ఒక్కో సినిమాకి గాను రూ. 1 కోటి పారితోషికం తీసుకునేది. కానీ.. ఆ సినిమా రిలీజయ్యాక తనకు డిమాండ్ పెరిగిపోవడంతో, తన రెమ్యునరేషన్ ఫిగర్‌ను ఏకంగా రూ. 4 కోట్లకు పెంచేసిందట! రష్మిక కాస్తా క్రషిగా మారి మూవీ ప్రాజెక్టులను మరో హీరోయిన్లకు దొరక్కుండా ఆ అవకాశాలన్నీ తన ఖాతాలో వేసుకుంటుంది ఈక్రష్ బ్యూటీ.
Read also: Amma Jayalalithaa Death Mystery Live: జయలలిత వైద్యం.. శశికళ కనుసన్నల్లో..
చేతినిండా ఏడు నుంచి పది వరకు సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా వుంది. అయితే కోలీవుడ్ స్టార్ రజనీకాంత్ మాజీ అల్లుడు హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక మూవీ వస్తోంది. ఇందులో హీరోయిన్ గా రష్మిక ఛాన్స్ కొట్టేసింది. అంతకంటే ముందు ధనుష్ సరసన సాయిపల్లవి అనుకున్నారు. కానీ.. సాయిపల్లవి షెడ్యూల్ లో బిజీ కావడంతో.. సాయిపల్లవిని పక్కన పెట్టేసినట్టు ఆమె స్థానంలోకి రష్మిక మందన సెలెక్ట్ చేశారట. దీంతో రష్మిక ఈమూవీకి భారీగానే పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈసినిమాలో ధనుష్- రష్మిక రోమాన్స్ సీన్స్ ఉంటాయట. ఇప్పటికే ధనుష్, ఐశ్వర్య విడాకుల విషయం హాట్ టాపిక్ నడుస్తోంది. ఫ్యామిలీ విషయాలతో సతమతమవుతున్న ధనుష్ ఇలాంటి పరిస్థితుల్లో రష్మిక- ధనుష్ తో కలిసి రొమాన్స్ చేసేందుకు ఒప్పుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రష్మిక ఏంటి ఇంతలా తెగించింది. డబ్బుకోసం మరీ ఇంతగా చేయాలా? అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఏమాత్రం ఆలోచించకుండా రష్మిక ఇలాంటి పనికి ఒప్పుకుంది.. రష్మిక అభిమానులే ప్రశ్నిస్తున్నారు. అయితే ఒకరకంగా రష్మిక సినీ కెరీర్‌కు మైనస్ అవుతుందనే మాట కూడా వినిపిస్తోంది. ఏమైనా సరే ధనుష్ తో అయితే రష్మిక రొమాన్స్ సీన్స్ చేసేందుకు ఒప్పుకున్న నిర్ణయాన్ని మార్చకుంటుందా? లేదా? అనే విషయమైన నెటిజన్లు కామెంట్లు కమెంట్లు చేస్తున్నారు. ఆమె కెరీర్ ముందుకు సాగాలంటే ఇలాంటి సీన్స్ చేయకపోవడమే మంచిదని టాక్.. మరి దీనిపై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి.
Selfi Video: అప్పులు తీర్చలేక గవర్నమెంట్ ఉద్యోగి షాకింగ్ డెసిషన్
