గత కొద్దిరోజులుగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల రిలేషన్ మీద సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చకు ఎట్టకేలకు రష్మిక స్వయంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో వచ్చిన ప్రస్తావనను వక్రీకరిస్తూ నెటిజన్లు గుప్పిస్తున్న విమర్శలు, సలహాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘమైన, భావోద్వేగపూరితమైన లేఖను పంచుకున్నారు.
నెట్టింట కొందరు వ్యక్తులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు నిర్మాణాత్మకంగా కాకుండా, ఒక ‘ఆగ్రహంతో కూడిన గుంపు’లా మారి దాడి చేస్తున్న తీరును ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ఇటీవల వీరిద్దరి బంధంపై జరిగిన చర్చల్లో ‘100 సార్లు ప్రపోజల్’, ‘సంవత్సరాల సమయం’ లేదా ‘ఎన్నిసార్లు అడిగారు’ అనే అంశాలపై నెట్టింట పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. విజయ్ ఆమెను సరిగ్గా చూసుకోవడం లేదని, రష్మిక ఆ బంధం నుంచి బయటకు రావాలంటూ కొందరు మహిళలు రీల్స్ చేయడంపై ఆమె ఘాటుగా స్పందించారు.
రష్మిక దీనిపై సూటిగా మాట్లాడుతూ —”మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ గ్రాండ్ ప్రపోజల్స్ గురించో, రింగులు తొడగడం గురించో కాదు. జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలను కలిసి ఎదుర్కోగలమా లేదా అనే ప్రాక్టికల్ విషయాలపై విజయ్ ఆలోచించి సమయం తీసుకున్నాడు. నాకు ఏం కావాలో నాకు తెలుసు, తను ఆలోచించి అడుగు వేసే వ్యక్తి. మేము ఒకరినొకరం అర్థం చేసుకుని, ఒకరికోసం ఒకరం నిలబడాలని నిర్ణయించుకున్నాం. అతను వందసార్లు కాదు.. వేయిసార్లు ఆలోచించినా నాకు అభ్యంతరం లేదు” అని తేల్చిచెప్పారు. * “అవును.. నేను నా భాగస్వామితో అబ్సెస్ అయ్యాను”: “నేను ప్రేమించే, పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని అమితంగా ఇష్టపడటంలో తప్పేముంది? అతనే నా జీవితాంతం తోడుగా ఉండే స్నేహితుడు, నా పిల్లలకు కాబోయే తండ్రి, నాతో పాటు వృద్ధాప్యాన్ని పంచుకునే నా మనిషి” అంటూ విజయ్‌పై తనకున్న అపారమైన ప్రేమను బాహాటంగా ప్రకటించారు.
ఉచిత సలహాలు ఇచ్చే నెటిజన్లను ఉద్దేశించి మాట్లాడుతూ — “నా జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు మీరెవరూ లేరు. నాకు ఎముక విరిగినప్పుడో, నెలకు వచ్చే నొప్పులతో బాధపడినప్పుడో, అర్ధరాత్రి ఆందోళనతో మేల్కొన్నప్పుడో మీరెవరూ లేరు.. అతను మాత్రమే ఉన్నాడు” అంటూ అత్యంత సున్నితమైన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి విమర్శకుల నోళ్లు మూయించారు. నాపై ఏమైనా మాట్లాడండి, కానీ నా కుటుంబాన్ని మధ్యలోకి లాగడం ఫెమినిజం కాదని స్పష్టం చేశారు. ఎదుటివారిని కించపరచడమో, ఆధిక్యత ప్రదర్శించడమో ఫెమినిజం కాదని, అది కేవలం ఫెమినిజం ముసుగులో చేస్తున్న
గత వివాదాలను ప్రస్తావిస్తూ కొందరు చేస్తున్న విమర్శలకు బదులిస్తూ — “పదేళ్లు గడిచినా మీ హృదయాల్లో నాకింకా ఇంత చోటు ఉన్నందుకు ఆనందంగా ఉంది” అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఎవరో సృష్టించిన తప్పుడు కథనాలు, ఎడిట్ చేసిన వీడియోలను నమ్మి ఎదుటివారి వ్యక్తిగత జీవితాలపై తీర్పులు ఇవ్వడం వింతగా ఉందని రష్మిక పేర్కొన్నారు. తామిద్దరం స్వతంత్రంగా ఎదిగిన పరిణతి కలిగిన వ్యక్తులమని, కలిసి జీవించాలని నిర్ణయించుకున్నామని చెబుతూ, ఇతరులు కూడా తమ సొంత జీవితాల్లో సంతోషాన్ని వెతుక్కోవాలని హితవు పలికారు.

