కన్నడలో కిర్రాక్ పార్టీ అనే చిన్న సినిమాతో సినీ ప్రవేశం చేసిన రష్మిక మందన్న, చాలా తక్కువ కాలంలోనే, సౌత్ నుంచి.. బాలీవుడ్ వరకు పాపులారిటీ సంపాదించుకుని ‘నేషనల్ క్రష్’ అని పిలిచే స్థాయికి చేరుకున్నారు. వరుస పెట్టి యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర వంటి భారీ ప్రాజెక్టులతో.. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ గ్రాఫ్ అమాంతం పెంచేసింది. కానీ తెర వెనుక మాత్రం ఆమెను కిందకు లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. అవును తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్న తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి స్పందించారు.
Also Read : Undermine : మిమ్మల్ని చులకనగా చూసే వారికి ఈ ఒక్క సమాధానం..
ఆమె మాటల్లోనే “నా గురించి సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ యాదృచ్ఛికం కాదు. ఇది ఓ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. దానికి కొందరు డబ్బులు కూడా ఇస్తున్నారు. మనుషులు ఎందుకు ఇంత క్రూరంగా మారుతున్నారు అనేది నాకు అర్థం కావడం లేదు. నన్ను ఇష్టపడకపోవచ్చు, పర్లేదు. కానీ ఇలాంటి పనులు చేయకండి,అసలు టాలెంట్, హార్డ్‌వర్క్‌ని ఎవరూ ఆపలేరు’ అని ఆమె అన్నారు. ఇక..
రష్మిక వ్యాఖ్యలు బయటకు రాగానే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘ఇది ఇండస్ట్రీలోని అంతర్గత పోటీ ఫలితమా?’ అనే ప్రశ్నలు నెటిజన్లు వేస్తున్నారు. కొంతమంది అభిమానులు రష్మికకు మద్దతుగా నిలుస్తూ ‘మిమ్మల్ని ఎవరూ ఆపలేరు’ అని కామెంట్ పెడుతుంటే, మరికొందరు మాత్రం ‘ట్రోలింగ్ కి కారణం ఆమె ప్రవర్తనే’ అని అంటున్నారు. ఇక కెరీర్ పరంగా దూసుకుపోతున్న రష్మిక ఈ విజయాలతో పాటు వెనుక వ్యక్తిగత, సోషల్ మీడియా స్థాయిలో ఎదురవుతున్న ప్రతికూల వాతావరణాన్ని ఆమె ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
