Site icon NTV Telugu

Rashmika :చావా నుంచి థామా వరకు.. 2025 లో రష్మిక దుమ్ము రేపిన కలెక్షన్లు!

Rashmika

Rashmika

నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు వినగానే ఇప్పుడు బాక్సాఫీస్ హిట్‌ గ్యారంటీగా మారిపోయింది. ఈ అందాల భామ 2025 లో తన సినిమాలతో అద్భుతమైన రికార్డులు సృష్టించింది. సంవత్సరం మొత్తం ఆమె నటించిన నాలుగు సినిమాలు రూ.100 కోట్ల మార్క్‌ దాటడం ఒక పెద్ద ఘనతగా నిలిచింది. తాజాగా విడుదలైన “థామా” సినిమా కూడా ఆ లిస్టులో చేరి రష్మిక విజయపథాన్ని మరింత బలపరచింది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ భారతదేశంలో ఘన విజయం సాధిస్తోంది. లెక్కల ప్రకారం, థామా ఇప్పటి వరకు ఇండియాలోనే రూ.119.65 కోట్లు వసూలు చేసింది.

Also Read : Ilaiyaraaja: 15 ఏళ్లలోపు ప్రతిభావంతులైన చిన్నారులకు ఇళయరాజా గోల్డెన్ ఛాన్స్!

2025 మొదట్లో రష్మిక విక్కీ కౌశల్ సరసన నటించిన “చావా”తో థియేటర్లలో దుమ్మురేపింది. ఈ సినిమా అంచనాలకు మించి సూపర్ హిట్‌గా నిలిచి రూ.800 కోట్లు పైగా వసూళ్లు సాధించింది. తర్వాత సల్మాన్ ఖాన్ తో చేసిన “సికందర్” కొంత మిశ్రమ టాక్ తెచ్చుకున్నప్పటికీ, వసూళ్ల పరంగా మాత్రం రూ.200 కోట్ల మార్క్‌ దాటేసింది. దీని తర్వాత ధనుష్–నాగార్జున మల్టీ స్టారర్ “కుబేర”లో రష్మిక నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా కూడా రూ.130 కోట్ల వసూళ్లను సాధించింది. ఇక ఇప్పుడు థామా కూడా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరి రష్మిక విజయ జాబితాను మరింత పొడిగించింది.

ఇక గతంలో “యానిమల్” మరియు “పుష్ప 2” చిత్రాలతో భారీ బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న రష్మిక, ఇప్పుడు వరుసగా ఆరు సినిమాలతో రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన రేర్ హీరోయిన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఇంకా రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయట ఒకటి దక్షిణాది బిగ్‌ బడ్జెట్‌ పాన్‌ ఇండియా మూవీ, మరొకటి హాలీవుడ్ లెవల్ వెబ్ సిరీస్‌. ఈ వేగం చూస్తుంటే రష్మిక బాక్సాఫీస్ సామ్రాజ్యం ఇంకా కొన్ని ఏళ్ల పాటు కొనసాగడం ఖాయం అనిపిస్తుంది.

Exit mobile version