Site icon NTV Telugu

Rashmika Mandanna : బేబీ దర్శకుడిపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు..

Rashmika Mandanna

Rashmika Mandanna

Rashmika Mandanna : టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గం గం గణేశా”.నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ ,కరిష్మా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో వెన్నెలకిషోర్,జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇమ్మానుయేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి ,వంశి కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ అందించారు.ఈ చిత్రం మే 31 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.దీనితో ఈ మూవీ మేకర్స్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

Read Also :OG : ఆ ఫైట్ సీక్వెన్స్ కోసం పవన్ అన్ని రోజులు కష్టపడ్డారా..?

ఈ ఈవెంట్ కు నేషనల్ క్రష్ రష్మిక మందన్న ముఖ్య అతిధిగా వచ్చారు.అయితే అదే ఈవెంట్ కి బేబీ సినిమాతో ఆనంద్ కి మంచి హిట్ ఇచ్చిన సాయి రాజేష్ కూడా హాజరు అయ్యారు.ఈ నేపథ్యంలో రష్మిక బేబీ మూవీ దర్శకుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.నేను సాయి రాజేష్ గారి బేబీ సినిమా చూసాను.ఆ సినిమా చూసి ఏడ్చేసాను.దర్శకుడు సాయి రాజేష్ బేబీ సినిమాను ఎంతో డెడికేషన్ తో తెరకెక్కించారు.ఆ సినిమా చూసాక నాకు ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలి అనిపించింది.అది కూడా ఓ మెంటల్ క్యారెక్టర్ చేయాలనీ రష్మిక తెలిపింది.ప్రస్తుతం రష్మిక చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.

Exit mobile version