NTV Telugu Site icon

Rashmika: బన్నీని పూర్తిగా నమ్మేసి సరెండర్ అయిపోయాను!

Rashmika

Rashmika

పుష్ప టు ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. హాయ్ అండి బాగున్నారా అందరూ చాలా చిల్ అవువుతున్నారు. అసలు మీ ఎనర్జీ ఎక్కడెక్కడో ఎలాగెలాగో ఉంది అంటూ కామెంట్ చేసింది. నేనైతే మీ ఎనర్జీ తీసుకుని చాలా ఎంజాయ్ చేస్తున్నాను, థాంక్యూ ఐ లవ్ యు అంటూ అభిమానులను ఉద్దేశించి కామెంట్ చేసింది. ఇప్పుడైతే ఒక మేటర్ చెప్పనా నేను ప్రమోషన్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్లి మాట్లాడాం నేను టీం గురించి ఎక్కడ ఎక్కువగా మాట్లాడలేకపోయాను సో ఈరోజు టైం తీసుకుని అందరి గురించి మాట్లాడాలి అని ప్రిపేర్ అయి వచ్చాను. మీకు ఓకేనా అని అడిగి ఆమె మాట్లాడటం మొదలుపెట్టారు. ముందుగా ఫస్ట్ పార్ట్ చేస్తున్నప్పుడు మైండ్ లో ఒకటే ఉండిపోయింది అసలు పుష్ప పర్ఫామెన్స్ ఇస్తే అదిరిపోవాలి అని నేను నిజంగా చెబుతున్నాను. నా హార్డ్ వర్క్ మొత్తం పెట్టేసి సుక్కు సార్ డైరెక్షన్లో నేను సరెండర్ అయిపోయాను. బన్నీ సార్ ను పూర్తిగా నమ్మేసి సరెండర్ అయిపోయాను. ఈరోజు ఏమైనా పర్ఫామెన్స్ చూస్తున్నారు అంటే అది సుకుమార్ బన్నీ కారణంగానే.

Allu Arjun: పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ థాంక్స్

సో థాంక్యూ. సుకుమార్ గారు చాలా షైగా ఉంటారు, సైలెంట్ గా ఉంటారు. ఫస్ట్ పార్ట్ చేస్తున్నప్పుడు ఎలా మాట్లాడాలి? ఎలా డౌట్స్ అడగాలి అని అనుకునేదాన్ని కానీ పుష్ప 2 చేస్తున్నప్పుడు ఎంత కంఫర్టబుల్ అయిపోయామంటే అసలు డౌట్స్ లేకుండా కూడా వెళ్లి మాట్లాడడమే అంత కంఫర్టబుల్ అయ్యాం. సో నాకేంటంటే సార్ తో ఎంత కంఫర్టబుల్ అనిపిస్తుంది అంటే అసలు ఇంకోసారి అవకాశం దొరికితే అసలు కుమ్మేస్తా అని ప్లాన్ చేశాను అని చెప్పుకొచ్చారు. అంతేకాక సుకుమార్ సార్ మీరు బెస్ట్ వీ లవ్ యు సార్ అంటూ ఆమె కామెంట్ చేసింది. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో మా అందరికీ తెలుసు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో అందరూ చూస్తారు. శ్రీలీల చెబుతున్నట్టు ఈ సినిమా బోర్డర్స్ క్రాస్ చేసి కంట్రీస్ క్రాస్ చేసి ఇంటర్నేషనల్ అయిపోవాలి అని ఒక కోరిక ఉంది. అని అది జరగాలని దేవుణ్ణి కోరుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నా హోమ్ గ్రౌండ్ లాగా అయిపోయింది. మైత్రిలో చాలా సినిమాలు చేయాలని నాకు ఒక కోరిక ఉంది సార్ మిమ్మల్ని నేను ఎంత ఇరిటేట్ చేసినా మీతో ఇంకా పనిచేయాలని ఉంది మళ్లీ మీతో పని చేస్తానని అనుకుంటున్నానని చెప్పింది.