Site icon NTV Telugu

Rashmi: మత్తు మందిచ్చి అనుభవించాలనుకున్నాడు.. కాస్టింగ్ కౌచ్‌పై రష్మీ దేశాయ్ సంచలనం

Rashmi Desai

Rashmi Desai

హిందీ టీవీ నటి రష్మీ దేశాయ్ ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. కెరీర్ ప్రారంభంలోనే కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చిందని రష్మీ దేశాయ్ వెల్లడించింది. ఈ సంఘటన జరిగినప్పుడు, తన వయస్సు కేవలం 16 సంవత్సరాలని ఆమె పేర్కొంది. ‘దురదృష్టవశాత్తూ నేను ఇలాంటి అనుభవాన్ని అనుభవించాల్సి వచ్చింది, దాని గురించి చాలాసార్లు బహిరంగంగా మాట్లాడా’ అని ఆమె చెప్పింది. తాజాగా రష్మీ దేశాయ్ మాట్లాడుతూ ఒకరోజు నన్ను ఆడిషన్‌కి పిలిచినట్లు గుర్తు, నేను చాలా ఉత్సాహంగా అక్కడికి చేరుకున్నాను, కానీ అక్కడ ఒక వ్యక్తి తప్ప ఎవరూ లేరు. అక్కడ కెమెరా కూడా లేదు. నా డ్రింక్‌లో డ్రగ్స్ వేసి నన్ను అపస్మారక స్థితికి తీసుకువెళ్లి అనుభవించాలని తన శాయశక్తులా ప్రయత్నించాడు.

Chennai: తల్లిపై మమకారం.. వైద్యం సరిగా చేయలేదని డాక్టర్‌పై కొడుకు దాడి

ఇదంతా వద్దు అని చెప్పా, ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి ఇంటికి వచ్చి అమ్మతో అంతా చెప్పాను. ‘మరుసటి రోజు, నేను ఆ వ్యక్తిని కలవడానికి మా అమ్మతో కలిసి వెళ్ళా, అతనికి గుణపాఠం చెప్పడానికి మా అమ్మ అతన్ని కొట్టినట్లు నాకు గుర్తుంది. కాస్టింగ్ కౌచ్ వాస్తవం. అయితే ప్రతి ఇండస్ట్రీలోనూ మంచివాళ్లు, చెడ్డవాళ్లు ఉంటారు అని ఆమె చెప్పుకొచ్చింది. రష్మీ దేశాయ్ ‘ఉత్తరన్’, ‘దిల్ సే దిల్ తక్’ వంటి టీవీ షోలలో కనిపించింది. ఇప్పుడు సినిమాల వైపు టర్న్ అయిన ఆమె మిషన్ లైలా, హిసాబ్ బరాబర్ అనే హిందీ సినిమాల్లో నటించింది.

Exit mobile version