NTV Telugu Site icon

Rapo22 : మెుత్తానికి రామ్ రూటు మార్చి మరో సినిమా స్టార్ట్ చేసాడు

Rapo22

Rapo22

ఇప్పుడున్న టాలీవుడ్ యంగ్ హీరోలలో డాన్స్, యాక్టింగ్, అందం ఇలా అన్ని ఉన్న నటులలో రామ్ పోతినేని అగ్ర స్థానంలో ఉంటాడు. కానీ ఈ హీరో టాలెంట్ కు తగ్గ సినిమాలు చెయ్యట్లేదు నే టాక్ అటు ఫాన్స్ లోను ఇటు టాలీవుడ్ లోను గట్టిగా వినిపించే మాట. ఇటీవల పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన డబుల్ ఇస్మార్ట్ ఘోర పరాజయం పాలయింది. దింతో కాస్త గ్యాప్ తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘ఉస్తాద్‌’ రామ్‌ పోతినేని హీరోగా బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ ఓ సినిమా చేస్తోంది . నవీన్‌ పోలిశెట్టి హీరోగా వచ్చిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ సినిమాకు దర్శకత్వం వహించిన మహేష్‌బాబు.పి దర్శకత్వంలో రామ్ పోతినేని నటించనున్నాడు.

తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గురువారం అనగా 21న విశిష్ట అతిధుల సమక్షములో ఈ సినిమా పూజ కార్యక్రమంనిర్వహించనున్నారు. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి వరుసగా మాస్ యాక్షన్ ఫిలిమ్స్ చేస్తూ ప్లాప్స్ అందుకున్న రామ్ ఈ సారి రూట్ మార్చాడు. తాజగా విడుదల చేసిన పోస్టర్ లో రామ్ సైకిల్‌తో పాటు నడుస్తూ కనిపిస్తున్నట్టు చూపిస్తూ మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్ర ఎదో చేస్తునట్టు చూపించారు.  రామ్ సినీ కెరీర్ లో  22వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. రాపో మంచి కంటెంట్ తో రాబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీ సర్కిల్స్ కూడా వినిపిస్తోంది.

Show comments