NTV Telugu Site icon

Rapo 22: రామ్ సినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్..?

Vivek Marvin

Vivek Marvin

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హీరోగా రామ్ 22వ సినిమా ఇది. డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ చేస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఎన్నోఆశలు పెట్టుకున్నారు.

Also Read : Pushpa 2: పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ పై టెన్షన్.. ?

కాగా ఈ సినిమాను సరికొత్త పంధాలో తెరకెక్కించనున్నాడు దర్శకుడు మహేశ్. అందుకోసం అంతా కొత్తవారితో వెళుతున్నాడు. ఇప్పటికే హీరోయిన్‌గా యంగ్ అండ్ హ్యాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ను ఫిక్స్ చేసారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో కూడా దర్శకుడు కొత్త వారిని ఎంపిక చేస్తున్నాడు. రామ్ కోసం తమిళ్ కు చెందిన మార్విన్ సోలొమన్, వివేక్ శివకు సంగీత భాద్యతలు అప్పగించాలని మహేశ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం దర్శకుడు ఇటీవల చెన్నై లో వివేక్, మార్విన్ లను కలిసి కథ నేపథ్యంను వివరించారు. దాదాపు ఈ మ్యూజిక్ ద్వయం కన్ఫర్మ్ అని యూనిట్ ద్వారా సమాచారం అందుతోంది. వివేక్ మార్విన్ లు గతంలో కార్తీ హీరోగా నటించిన సుల్తాన్, ప్రభుదేవా నటించిన గుళేభావకళి వంటి సినిమాలకు సంగీతం అందించారు. మరి ఇప్పుడు రామ్ సినిమాకు ఎటువంటి మ్యూజిక్ అందిస్తారో చూడాలి. త్వరలోనే రామ్ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్స్ పై అధికారక ప్రకటన రానుంది

Show comments