ఆదివారం సూపర్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో పాటు దిగ్గజ క్రికెటర్లు ఎంఎస్ ధోని, శ్రేయాస్ అయ్యర్ ఫుట్‌బాల్ మ్యాచ్ లో పాల్గొన్నారు. ముంబైలో జరిగిన గేమ్ కు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రణబీర్ కపూర్, డినో మోరియాతో సహా సినీ ప్రముఖులు చాలా మంది ఫుట్‌బాల్ మైదానంలో తరచుగా కనిపిస్తారు. ఇటీవలే దిశా పటాని, టైగర్ లతో పాటు పలువురు ఫుట్ బాల్ ఆడిన పిక్స్ కూడా బయటకు వచ్చాయి.
Read Also : “కామ్రేడ్”ను గుర్తు చేసుకున్న విజయ్ దేవరకొండ
రణ్వీర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి మ్యాచ్‌లోని తన ఫేవరెట్ మెమొరీస్ ను పంచుకున్నాడు. శ్రేయస్ అయ్యర్, ఎంఎస్ ధోనిలతో కలిసి ఉన్న ప్రతి చిత్రాన్ని వినోదాత్మక శీర్షికలతో పంచుకున్నాడు. మొదటి చిత్రంలో రణవీర్ సింగ్ శ్రేయాస్ అయ్యర్ ఫుట్‌బాల్ జెర్సీని పట్టుకున్నాడు. “అతనిని ఆపడానికి వేరే మార్గం లేదు” అని క్యాప్షన్ ఇచ్చాడు. రెండవ చిత్రంలో ధోని బెంచ్ మీద కూర్చుని ఉండగా, రణవీర్ మైదానంలో కూర్చున్నాడు. అతను “బడే భాయ్ కే చార్నోన్” అని కామెంట్ చేశాడు. రణ్‌వీర్ లెజెండ్ ఎంఎస్ ధోనికి పెద్ద అభిమాని.
