Ranveer – Deepika: దువాతో రణవీర్ – దీపిక క్యూట్ ఫ్యామిలీ పిక్స్ వైరల్.. బేబీ బంప్‌తో దీపిక స్పెషల్ అట్రాక్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranveer – Deepika: బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపిక పదుకొణె మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ జంట తమ కుమార్తె దువాతో కలిసి దిగిన క్యూట్ ఫ్యామిలీ ఫొటోలను అభిమానులతో పంచుకోవడంతో అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో దీపిక బేబీ బంప్‌తో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఈ ఫ్యామిలీ పిక్స్‌పై ఆసక్తిగా స్పందిస్తున్నారు. రణవీర్ సింగ్, దీపిక పదుకొణె 2018లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2024లో ఈ జంట తమ మొదటి సంతానంగా కుమార్తె దువాకు స్వాగతం పలికింది. దువా పుట్టినప్పటి నుంచి ఆమెకు సంబంధించిన ఫొటోలను ఈ స్టార్ కపుల్ చాలా పరిమితంగానే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా దువాతో కలిసి ఉన్న ఫ్యామిలీ మూమెంట్స్‌ను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకోవడంతో అభిమానులకు స్పెషల్ ట్రీట్‌గా మారింది.
ఇదే సమయంలో దీపిక బేబీ బంప్‌తో కనిపించడం కూడా వైరల్‌గా మారింది. ఈ జంట త్వరలో తమ రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఫొటోలు మరింత వైరల్ అవుతున్నాయి. కుటుంబంతో కలిసి రణవీర్, దీపిక పంచుకున్న ఈ అందమైన క్షణాలకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక వారి సినిమాల విషయానికొస్తే.. ‘ధురంధర్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న రణవీర్ సింగ్ ప్రస్తుతం ‘ప్రళయ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు దీపిక పదుకొణె అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాకా’లో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల ఆమె బేబీ బంప్‌తోనే షూటింగ్లో పాల్గొన్నట్లు వార్తలు కూడా వచ్చాయి.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?


తాజావార్తలు
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!