Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranabali Documentary: సినిమా మార్కెటింగ్‌లో ప్రేక్షకుడి కుతూహలాన్ని రేకెత్తించడమే ప్రధాన లక్ష్యం. అయితే ఆ క్యూరియాసిటీని పెంచే క్రమంలో కథను ఎంతవరకు బయటపెట్టాలనేది ఎప్పుడూ అత్యంత సున్నితమైన అంశమే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న భారీ పీరియాడిక్ మూవీ ‘రణబాలి’ ప్రమోషన్ల విధానం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ తీవ్ర చర్చకు తెరలేపింది. టీజర్లు, ట్రైలర్లతో రొటీన్‌గా వెళ్లకుండా ఏకంగా నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ సిరీస్‌ను రిలీజ్ చేయాలన్న మేకర్స్ నిర్ణయం ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది.
1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన కాలంలో రాయలసీమలో నెలకొన్న భయానక కరువు పరిస్థితులు, ఆకలి కేకలు, వలస పాలకుల దోపిడీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చారిత్రక పరిణామాలను, సినిమా మూలాలను ప్రేక్షకులకు ముందే విశదీకరించేందుకు విజయ్, రష్మిక, దర్శకుడు రాహుల్‌లతో కూడిన ఈ డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్‌ను సెప్టెంబర్ 28 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఇలా చేయడం వల్ల కథా నేపథ్యాన్ని ప్రేక్షకులకు క్షుణ్ణంగా పరిచయం చేసి సినిమాపై మంచి బజ్ తీసుకురావచ్చన్నది ఒక వాదనైతే, అసలు నేపథ్యాన్నంతా పూసగుచ్చినట్లు ముందే విడమరిచి చెబితే థియేటర్లలో ప్రేక్షకుడికి కొత్త అనుభూతి ఏమి మిగులుతుందనేది మరో ప్రధాన సందేహం వ్యక్తం అవుతుంది.
Also Read
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
ఇప్పటికే ‘ఏందయ్యా స్వామి’ పాట, టీజర్‌తో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. అలాంటి టైంలో సినిమా చూడకముందే డాక్యుమెంటరీ రూపంలో అసలు విషయాలను వివరంగా చూపించేయడం వల్ల కథ తాలూకు తాజాదనం దెబ్బతింటుందా, ఆసక్తి చచ్చిపోతుందా అనే భయాలు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. చరిత్రను అర్థం చేసుకుని సినిమా చూస్తే కనెక్ట్ అవ్వడం సులువవుతుందని కొందరు భావిస్తుంటే, థ్రిల్ తగ్గించేసే రిస్క్ ఉందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా, మేకర్స్ ఎంచుకున్న ఈ సరికొత్త వ్యూహం అంచనాలను ఆకాశానికి ఎత్తుతుందా లేక సినిమా ఎగ్జైట్మెంట్ను ముందే దించేస్తుందా అనేది అక్టోబర్ 16న బాక్సాఫీస్ ఫలితమే తేల్చాలి.
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!